Nandi Awards| 2008| TammaReddy Bharadwaja| Telugu Cinemas| Raviteja| Gamyam| Colour Swati | తెలుగు సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోయింది: తమ్మారెడ్డి
FILE
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోతుంది. నంది అవార్డుల ఎంపిక కోసం దాదాపు 72 సినిమాలు చూశాను. ఏ కొద్ది సినిమాలు తప్పనిస్తే.. మిగిలిన సినిమాలు అంతగా బాగోలేవని చెప్పారు. టెక్నికల్‌పరంగా భారీ వ్యయంతో తెరకెక్కించిన సినిమాల్లో కథాబలం లోపించిందని భరద్వాజ తెలియజేశారు.
మన తెలుగు సినిమా పరిశ్రమలు కథలు అందించే రచయితలు ఉన్నా.. నిర్మాతలు సినిమా తీసేందుకు ముందుకు రావడం లేదని వాపోయారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా నంది అవార్డుల కోసం సినిమాలను ఎంపిక చేయడం కష్టతరమైందని చెప్పారు.
రాష్ట్రస్థాయి అవార్డులకే మంచి సినిమాలు లభించని పక్షంలో జాతీయస్థాయి అవార్డులకు తెలుగు చిత్రాలు ఎలా ఎంపికవుతాయని ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఎంతవరకు సమంజసమని భరద్వాజ తెలిపారు.
65 విభాగాల్లో నంది అవార్డులను ఎంపిక చేశామని, ఇందులో పిల్లల సినిమా క్యాటగిరీలో ఏ ఒక్క సినిమా ఎంపికకాకపోవడం శోచనీయమని తమ్మారెడ్డి అన్నారు. ఏదో సబ్సీడీల కోసం సినిమాలు తీసేస్తున్నారనే తప్ప.. అందులో క్వాలిటీ చాలావరకు తగ్గిపోయిందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రస్థాయి నంది అవార్డులకే సరైన సినిమాలు లభించకపోవడం, ఇకపై.. సినిమాలు తీసే నిర్మాతలకు ఓ హెచ్చరికగా నిలుస్తుందని తమ్మారెడ్డి ఆశించారు.