గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » నంది అవార్డు దక్కడానికి పూరీనే కారణం: రవితేజ (Nandi Awards 2008| Raviteja| Puri Jagannath| Vinayakudu)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
Raviteja
FILE
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "నేనింతే" సినిమాకు నంది అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉందని క్రేజీ హీరో రవితేజ అన్నారు. తనను హీరోగా పెట్టి తీసిన సినిమాకు అవార్డు లభించడం, తానీస్థాయిలో ఉండటానికి కారణం పూరిజగన్నాథేనని ఆయన చెప్పారు.

"నేనింతే" సినిమాకు నంది అవార్డు లభించడం పట్ల పూరి మాట్లాడుతూ.. ఈ సినిమాను ఓ ఫీల్‌తో తీశాం. అది ఎప్పటికీ గుర్తుండిపోతుందని, రచయితగానూ తనకు నంది అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. "సంపాదించడం చేతకాని వెదవ ఐలవ్ యు చెప్పడం.." అనే డైలాగ్ చాలా ఇష్టమైందని పూరి అన్నారు. ఇంతవరకు పనిచేసిన సినిమాల్లో తనకు నచ్చిన సినిమా ఇదని తెలిపారు.

వినాయకుడు చిత్ర సమర్పకుడు ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇంతకుముందు "ఆ నలుగురు" సినిమాకి నంది అవార్డు వచ్చిందన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా తెరకెక్కించిన వినాయకుడికి నంది అవార్డు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీస్తున్న "విధేయుడు" కూడా వినోదనాత్మకంగా, సందేశాత్మకంగా తీశామన్నారు. తప్పకుండా ఈ సినిమాకు కూడా అవార్డు వస్తుందనే నమ్మకముందని చెప్పారు.

ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కీజేమేయర్ మాట్లాడుతూ.. హ్యాపీడేస్ తర్వాత నంది అవార్డు రావడం రెండోసారి అన్నారు. తన తదుపరి సినిమాలకు స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు.

ఉత్తమ హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. తన సినిమాల్లో రెడీ ప్రత్యేకంగా నిలిచింది. ప్రేక్షకుల నుంచి ఎన్నో ఆశీస్సులు వచ్చేట్లు చేసింది. ఈసారి ఉత్తమ హాస్యనటుడి అవార్డును గెల్చుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం రెడీ నిర్మాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పాత్రలు పోషించి మెప్పిస్తానని అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: నంది అవార్డులు 2008, రవితేజ, పూరి జగన్నాథ్, వినాయకుడు