ప్రధాన పేజివినోదం » వెండితెర » కథనాలు » సిద్ధార్థ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం (Siddharth| Shruti Hassan| Kamal Hassan| Prakash| Shriya Sharma)
సిద్ధార్థ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం
WD
పద్మభూషణ్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ టాలీవుడ్ రంగ ప్రవేశం చేయనుంది.
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు కె. ప్రకాష్ రూపొందించే నూతన చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. లవర్‌బాయ్ సిద్ధార్థ హీరోగా నటించే ఈ సినిమా షూటింగ్ ఆదివారం రామోజీ ఫిలింసిటీలో లాంఛనంగా ప్రారంభమైంది.
శృతిహాసన్, సిద్ధార్థ, ప్రముఖ టీవీ యాక్టర్, బాలనటి శ్రియాశర్మలపై తీసిన తొలిషాట్‌కు 'మగధీర' దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టారు.
అబోడ్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా దర్శకుడు ప్రకాష్ మాట్లాడుతూ.. టీవీ యాంకర్, బాలనటిగా పేరు సంపాదించిన శ్రియాశర్మ పాత్రే కథ కీలకమని అన్నారు.
'మగధీర' తరహాలో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని అన్నారు. భూలోకం నుంచి వేరే లోకానికి తీసుకెళ్లే విచిత్రమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా మలిచేందుకు రంగం సిద్ధం చేశామని ప్రకాష్ వెల్లడించారు.
ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు లవర్‌బాయ్‌గా కనిపించిన సిద్ధార్థ ఈ చిత్రం ద్వారా వీరప్రేమికుడు, యోధుడుగా కన్పిస్తాడని దర్శకుడు వెల్లడించారు. నేటి నుంచి ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో 8 నెలల్లోపు ఈ సినిమాను పూర్తి చేస్తామన్నారు. నేటి నుంచి (ఆదివారం) నుంచి 15 రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో "బ్లూ" సినిమా సెట్ తరహాలో అద్భుతంగా వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతుందని ప్రకాష్ చెప్పారు.
హీరో సిద్ధార్థ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సినీరంగంలో దిగ్గజాలైన మణిరత్నం వంటి దర్శకుల వద్ద పనిచేశాను. తాను హీరోగా నటించిన సినిమాలన్నీ చిన్న చిన్న దర్శకులు లేదా కొత్త దర్శకులచే లవర్‌బాయ్‌గా ఎదిగాను. కానీ రాజమౌళి, మణిరత్నం వంటి అగ్ర దర్శకులు సినిమాల్లో నటించలేకపోయానని సిద్ధార్థ అన్నారు.
కాగా.. రాజమౌళి వంటి దర్శకుడి చిత్రంలో హీరోగా నటించి ఉంటే తన రేంజ్ పెరిగిపోయి ఉండేదని లవర్‌బాయ్ తెలిపారు. మొత్తానికి రాజమౌళి తన సినిమాల్లో తనను తీసుకుని ఉంటే.. పెద్ద ఆర్టిస్టుగా ఎదిగేవాడినని సిద్ధార్థ వెల్లడించారు.
ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకెళ్లే ఈ చిత్రం గురించి హీరోయిన్ శృతిహాసన్ మాట్లాడుతూ.. గతంలో పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయని చెప్పింది. అవన్నీ కమల్ హాసన్ కుమార్తెగానే తనకు వచ్చిన ఆఫర్లని, అందువల్ల వాటిని తాను అంగీకరించలేదని స్పష్టం చేసింది. అయితే ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడైన ప్రకాష్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని శృతి స్పష్టం చేసింది.
ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకెళ్లే అద్భుతమైన కథతో తెరకెక్కే ఈ సినిమాలో అత్యున్నత గ్రాఫిక్స్ వర్క్స్‌తో ప్రకాష్ రూపొందించనున్నారు. సూర్యకాంతం పువ్వును తాకితేనే వేరే లోకానికి తీసుకెళ్లి.. ఆ లోకంలో జరిగే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంకా ఈ సినిమా గురించి గమ్యం దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. దర్శకేంద్రులు రాఘవేంద్ర, ఆయన తనయుడు ప్రకాష్‌లిద్దరూ కమిట్‌మెంట్ ఉన్న దర్శకులని ప్రశంసించారు. ముందుచూపుతో సినిమాను అత్యంత నైపుణ్యంగా మలచడంలో తండ్రీతనయులు నేర్పరులని క్రిష్ కితాబిచ్చారు.
జాతీయస్థాయిలో ఈ సినిమాకు దర్శకుడు ప్రకాష్ ఇంగ్లీషు మాటలు రాయడం విశేషం. "మగధీర"ను మించే స్థాయిలో భారీ సెట్లు, గ్రాఫిక్స్, టెక్నాలజీ వాల్యూస్ గల ఈ చిత్రానికి నిర్మాత: కె. రాఘవేంద్రరావు, సంగీతం: మిక్కీ జే మేయర్, ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్. మాటలు: భారవి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాష్.