1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Charan Raj | Cinema | Nagaraju | Karimnagar | ఆ పాట విన్నా... సినిమా తీయాలనిపించి వచ్చా: చరణ్ రాజ్

చరణ్ రాజ్
FILE
కథ వినకుండానే ఓ ఛానల్‌లో ఎక్కువగా ప్రసారం చేస్తున్న ఓ ప్రైవేట్ సాంగ్‌ను విని దానికి స్పందించి ఆ పాట వెనుక ఉన్న కథను ఆధారంగా చేసుకుని సినిమా తీయాలనుకుంటున్నాడు నటుడు చరణ్ రాజ్. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.

ఆ వివరాలను ఆయనే తెలియజేస్తూ... కరీంనగర్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి పాట టీవీలో వస్తుంటే ఓ స్నేహితుడు చెప్పడంతో చూశాను. అది ఎంతో నచ్చింది. అతని హృదయ వేదన ఆ పాటలో ఉంది. "నా ప్రాణమా... విడిపోకుమా అనిత... ఓ వనిత... నా ప్రేమను దోచిన అనిత..." అంటూ ఆయన ఆ పాట పాడి వినిపించారు.

కథ గురించి చెబుతూ, ఓ ఉన్నతమైన యువతిని అతను ప్రేమించాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నాను. ఆదివారంనాడే ఆయనతో సినిమా తీస్తానని చెప్పాను. హీరో ఎవరనేది ఇంకా నిర్ణయంచలేదు. ఇంకా ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు. సీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై డిశెంబరులో ఈ చిత్రాన్ని తెరపైకి ఎక్కించనున్నారు.

రేటింగ్ పెంచుకోడానికే...
ఇదిలా ఉండగా.. ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియాలో పోటీ విపరీతమవడంతో న్యూస్ ఛానల్స్‌కు రేటింగ్‌లు పడిపోయాయి. ఈ నేపధ్యంలో ఏదో ఒక క్రొత్త ప్రక్రియ చేయాలని నాగరాజు అనే వ్యక్తి రాసిన ప్రైవేటు పాటను పదే పదే బాగుందని చెపుతూ... ప్రాసారం చేసి ప్రధాన ఆకర్షణగా ఆ ఛానల్ చూపెట్టింది. ఇదంతా ఛానల్ ప్రమోషన్‌లో భాగమేనని ఆ ఛానల్‌కు చెందిన ఓ అధికారి తెలియజేశారు. ఆ పాటను చరణ్‌రాజ్ వంటి నటుడు విని సినిమా తీయడమనేది.. ఉన్న సంఘటనను బిజినెస్ చేసుకోవడానికా...? అనే సందేహాన్ని వెలిబుచ్చారు. సో... అదీ కథ
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT