1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Mega Power Star

Ram Charan Teja | Mega Power Star | Chiranjeevi | Magadheera | "మెగాస్టార్" రికార్డు అడుగు జాడల్లో "మెగా పవర్ స్టార్"

రామ్ చరణ్ తేజ
WD
రెండో సినిమాతోనే టాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేసిన రామ్ చరణ్ తేజ తన కెరీర్ గ్రాఫ్‌ను మరింత పగడ్బందీగా రూపొందించుకుంటున్నాడు. ఓ సామాన్య సినీ జీవిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి ఎంతటి ఘన రికార్డులను సాధించారో... వాటన్నిటినీ అనుక్షణం మననం చేసుకుంటూ ముందుకు సాగుతానంటున్నాడు.

ఇప్పటికీ తన తండ్రి చిరంజీవి కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలు మొదలు ఇంద్ర, ఠాగూర్ వరకూ అన్ని చిత్రాలను సమయం దొరికినపుడల్లా చూస్తుంటానని చెపుతాడు ఈ చిరుత.

టాలీవుడ్ కుర్ర హీరోల్లో ఎవర్‌గ్రీన్ బాయ్‌గా పేరుతెచ్చుకున్న మహేష్ బాబుకు సమానమైన పోటీనివ్వడంలో ఇతర కుర్రహీరోలు విఫలమయ్యారు. అసలు మహేష్ బాబు ఇమేజ్‌ను చేరుకోగల కుర్ర హీరో టాలీవుడ్‌లో లేరనే చాలామంది అనుకున్నారు. ఈ పరిస్థితుల్లో రామ్ చరణ్ తేజ మగధీర దూసుక వచ్చింది. విడుదలైన అన్ని ప్రధాన కేంద్రాల్లో శతదినోత్సవానికి పరుగులు తీయడమే కాక పోకిరి రికార్డులను అధిగమించే దిశలో పయనిస్తోంది.

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో మెగా బడ్జెట్‌తో సినిమాలను రూపొందించి కలెక్షన్లను చవిచూడాలంటే మెగా పవర్ స్టార్‌నే హీరోగా పెట్టుకోవాలన్న తలంపుకి దర్శకనిర్మాతలను తీసుకవచ్చాడు రామ్ చరణ్. మొత్తానికి మెగా వారసుడనిపించుకున్నాడు రామ్ చరణ్.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT