Akshay Kumar| Bumper Offer| Puri Jagannath| Cinema| Hindi| 143 | అక్షయ్‌కుమార్‌తో "బంపర్ ఆఫర్": పూరీ జగన్నాథ్
FILE
తెలుగులో విడుదలైన "బంపర్ ఆఫర్" సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయని, ఏలూరు ప్రాంతంలో పక్కన ఉన్న థియేటర్లలో కూడా వేరే సినిమా ఆపి ఈ చిత్రాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత పూరీ జగన్నాథ్ వెల్లడించారు.
రఘుకుంచె ఈ చిత్రానికి మ్యూజిక్ అందించి మంచి మార్కు సంపాదించాడని పూరీ తెలిపారు. 143 సినిమా తర్వాత సాయిరాం నటునిగా ఎదుగుతూ ఈ చిత్రంలో కొత్త గెటప్‌లో కన్పించి క్రేజీ హీరోగా అలరించాడని కితాబిచ్చారు. "మగధీర" చూసి అలీపై పారడీ చేయాలనిపించి రాజమౌళిని అడిగితే.. నీకు ఇష్టం వచ్చినట్లు మార్చుకోండని అన్నారని పూరి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
"బంపర్ ఆఫర్" సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు రఘుకుంచె మాట్లాడుతూ.. స్టార్‌వాల్యూ లేకపోయినా పూరే అనే ముద్ర ఓపెనింగ్స్‌పై బాగా పనిచేసిందన్నారు. ఇందుకు ఏలూరు థియేటర్లలో "బంపర్ ఆఫర్" షోలను పెంచడనే కారణమని ఆయన చెప్పారు. "రమణమ్మ" పాట ఈ సినిమా హైలైట్ అని.. దాన్ని డిజైన్ చేసింది పూరీనేనని రఘుకుంచె తెలియజేశారు.
సాయిరాం శంకర్ మాట్లాడుతూ.. ఐదేళ్ తర్వాత తనకు మంచి హిట్ లభించిందని, ఇది నిజమైన బంపర్ ఆఫర్ అని చెప్పారు. దర్శకుడు జయరవీంద్ర మాట్లాడుతూ.. కథ, మాటలు, నిర్మాతగా అన్ని తానై నడిపించిన పూరీనే నిజమైన హీరోనని కితాబిచ్చారు.