1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Priyamani

Pravarakyudu Movie| Priyamani| Jagapathi Babu| Hamsa nandini| Title| Launch | నా కెరీర్‌లోనే పెద్ద బడ్జెట్ చిత్రం "ప్రవరాఖ్యుడు": జగపతిబాబు

ప్రవరాఖ్యుడు
WD
జగపతిబాబు, ప్రియమణి, హంసానందిని జంటగా నటిస్తోన్న 'ప్రవరాఖ్యుడు' చిత్ర టైటిల్‌ను గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే పెద్ద బడ్జెట్ చిత్రమని అన్నారు. కీరవాణి మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుందని, ఈ సినిమా పాటల్ని డిస్కో తెక్‌లో కూడా వినేటట్లు సంగీతం అందించారని జగపతిబాబు వెల్లడించారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ప్రవరాఖ్యుడు అంటే తన భార్య మినహా మిగిలినవారికి దూరంగా ఉండేవాడు. తానీ ఈ ప్రవరాఖ్యుడు తన ప్రమేయం లేకుండా మహిళల్ని ఆకర్షిస్తాడు. అది ఎలాగా అనేది సినిమా.

ఇందులో జగపతిబాబు ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తాడు. ఇక ప్రియమణి పాత్ర సస్పెన్స్. ప్రేమకథలో కొత్తదనంగా ఉండే చిత్రమిది. నవంబర్‌లో ఆడియోను, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు చెప్పారు.

కీరవాణి మాట్లాడుతూ.. జగపతిబాబు నిర్మాతల మనిషి. ప్రియమణి తన నటనను ముఖంలో కూడా చూపిస్తుంది. అలా ఈ చిత్రంలోని ప్రతిపాటలోనూ అద్భుతంగా నటించింది. మొత్తానికి ప్రవరాఖ్యుడు గిలిగింతలు పెట్టే లవ్‌స్టోరీ. ప్రత్యేకించి "హిప్ఆఫ్" సాంగ్ సునీల్‌పై తీయడం ప్రత్యేకమని తెలిపారు.

ప్రియమణి మాట్లాడుతూ.. పెళ్లయిన కొత్తలో టీమ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. కీరవాణి బాణీలు చాలా బాగున్నాయి. 'ప్రవరాఖ్యుడు' మ్యూజికల్, కమర్షియల్ సినిమా అవుతుందని చెప్పారు.

ఇంకా ఈ సినిమాకు పాటలు: చైతన్యప్రసాద్, కెమెరా: సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మదన్.