1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Apartment| Cinema| Launch| Suspence| Thriller| Ravi varma | సస్పెన్స్ థ్రిల్లర్‌గా "అపార్ట్‌మెంట్" సినిమా ప్రారంభం

అపార్ట్మెంట్
WD
శ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై రవివర్మను హీరోగా పరిచయం చేస్తూ.. "అపార్ట్‌మెంట్" చిత్రం రూపొందుతోంది. ఎ.కె. శ్రీకాంత్, సతీష్ కె.వి. వేగేసిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామానాయుడు స్టూడియోలో పూజతో ఈ సినిమా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. దేవుని పటాలపై నిర్మాతల్లో ఒకరైన శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, మరో నిర్మాత సతీష్ కెమేరా స్విచ్ఛాన్ చేశారు.

ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, యాక్షన్, థ్రిల్లింగ్ గొలిపే అంశాలు ఇందులో చాలా ఉన్నాయని నిర్మాత అన్నారు. నవంబర్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి ఏకధాటిగా సాగే షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తిచేస్తామని మరో నిర్మాత సతీష్ పేర్కొన్నారు.

దర్శకుడు చిత్రం గురించి చెబుతూ.. తెలుగు, తమిళభాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, 70శాతం హైదరాబాద్‌లోనూ, మిగిలినది చెన్నైలోనూ చిత్రీకరిస్తామన్నారు. సస్పెన్స్ చిత్రంగా, వంశీ చిత్రమైన 'ఏప్రిల్ 1 విడుదల' తరహాలో ఉన్నా స్క్రీన్‌ప్లే కొత్తదనంగా ఉంటుంది.

ఇందులో నాలుగు పాటలున్నాయని చెప్పారు. ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని, ఈ చిత్రం ద్వారా రవివర్మ హీరోగా పరిచయం అవుతున్నారని చెప్పారు.
About Writer
SELVI.M