"గుడు గుడు గుంజం.. గుండే రాగం, పావుల పట్నం పడగేరాగం.." ఇది చిన్న పిల్లలాట.. పిడికిలి బిగించి ఆడే ఈ ఆటని ఒక వేళ పెద్దలు గుప్పెట్లో నిజం దాచుకుని ఆడితే ఎలా ఉంటుందనే చిలిపి ఆలోచనతో అల్లిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "గుడు గుడు గుంజం"
క్లైమాక్స్ పిక్నిక్ సాంగ్ మినహా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. నవంబరులో.. ఎడిటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసి, డిసెంబరులో సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత వి. రవికుమార్ రెడ్డి తెలిపారు.
ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, తరువాత కథ నచ్చి డా. రాజేంద్రప్రసాద్ నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా "గుడు గుడు గుంజం" అని, అందరూ ఇన్‌వాల్వ్ అయి నటిస్తే సినిమా రిజెల్ట్ ఎలా ఉంటుందో రష్ చూసిన తర్వాత అర్థమైందని, ఈ సినిమా తప్పకుండా రాజేంద్రప్రసాద్ హిట్ కామెడీ సినిమా లిస్ట్‌లో చేరుతుందన్నారు. "లేడీస్ టైలర్", "ఏప్రిల్ ఒకటి విడుదల" పక్కన ఈ సినిమా చేరుతుందనే గట్టి విశ్వాసం ఉందని ఎడిటింగ్ షూట్లో చాలామంది వ్యక్తపరిచారని నిర్మాత తెలిపారు.
WD
సుప్రీమ్ ఆడియో ద్వారా త్వరలో పాటలు విడుదల కానున్న ఈ చిత్రంలోని తొలిపాటను నవంబర్ 14న సినిమా గోయర్స్ వెబ్‌సైట్ ద్వారా విడుదల చేస్తున్నామని నిర్మాత వెల్లడించారు. ఇటీవల కాలంలో జల్సా.. ఆర్య-2 వంటి కొన్ని పాటలు ఆడియో విడుదల కంటే ముందు నెట్‌లో చోటు చేసుకోవడం పాపులర్ అవ్వడం దృష్ట్యా.. తామే అఫీషియల్‌గా ఓ పాటను నెట్‌ద్వారా రిలీజ్ చేయనున్నామని వి. రవికుమార్ రెడ్డి చెప్పారు.
డా. బ్రహ్మానందం, రఘుబాబు మరో కామెడీ హీరోయిన్‌తో సినిమాకు హైలైట్‌గా నిలిచే కామెడీ ట్రాక్ చిత్రీకరణ కోసం మరోసారి బ్యాంకాంగ్ ఫుకేట్ వెళ్లనున్నామని.. బ్యాంకాంగ్‌లో షూట్ చేసిన మూడు పాటలు యువతను కనువిందు చేసేలా డ్యాన్స్ మాస్టర్ ప్రసన్న రూపొందించారని ప్రస్తుతం సి.జీ. ఆప్టికల్ వర్క్ జరుగుతుందని దర్శకుడు తెలిపారు.
డా. రాజేంద్రప్రసాద్, డా. బ్రహ్మానందం, సుమన్, ఎమ్. ఎస్. నారాయణ, కృష్ణభగవాన్, కొండవలస, తెలంగాణ శకుంతల, గుండు సుధర్శన్, సితార, కస్తూరి, పార్థు, ఫరాఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: మరుధూరి రాజా, మాటలు: నంద్యాల రవి, పాటలు: కులశేఖర్, భాస్కరపట్ల, విశ్వ, కెమెరా: మధు, ఆర్ట్: బాబ్జి, డాన్స్: ప్రసన్న, ప్రేమ, ఎడిటింగ్: నందమూరి హరి, కాస్టూమ్స్: జానీ, ప్రొడక్షన్ కంట్రోలర్: రంబాల రాజేష్, నిర్మాత: వి. రవికుమార్ రెడ్డి, కథ, దర్శకత్వం: వీరు, నిర్మాణం: శ్రీ చిత్ర.