1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Nagarjuna| Cinema| Goa| King| Mamata Mohandas| Sivaprasad Reddy| Kamakshi Kala Movies | గోవాలో "కింగ్" నాగార్జున కొత్త చిత్రం!

నాగార్జున
WD
"కింగ్" నాగార్జున హీరోగా కామాక్షి కళామూవీస్ పతాకంపై అగ్రనిర్మాత డి. శివప్రసాదరెడ్డి కిరణ్ దర్శకత్వంలో నిర్మిస్తోన్న భారీ చిత్రం షెడ్యూల్ గోవాలో అక్టోబర్ 10 నుంచి జరుగుతోంది.

ఈ షెడ్యూల్ వివరాల్ని నిర్మాత డి. శివప్రసాదరెడ్డి చెబుతూ.. హీరో నాగార్జున, మోడల్స్ పాల్గొన్న ఓ పాటని సెట్‌వేసి చిత్రీకరించామన్నారు. నాగార్జున, షాయాజీ షిండే, బ్రహ్మానందం పాల్గొన్న కొన్ని ముఖ్య సన్నివేశాల్ని కూడా తీశామని చెప్పారు.

అలాగే "స్లమ్‌డాగ్ మిలియనీర్"లో విలన్‌గా నటించిన అంకుర్ ఈ చిత్రంలోనూ విలన్ పాత్రను పోషిస్తున్నారు. అంకుర్‌పై కొన్ని సన్నివేశాలు, నాగార్జునతో ఫైట్స్, ఛేజ్ పిక్చరైజ్ చేశామని నిర్మాత తెలిపారు. నవంబర్ నాలుగో తేదీ వరక జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రంలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతుందని ఆయన చెప్పారు.

తిరిగి నవంబర్ 10 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభమవుతుందని శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇందులో నాగార్జున సరసన మమత మోహన్‌దాస్ హీరోయిన్‌గా నటిస్తోంది. అమెరికా అమ్మాయి లిండా ఓ క్యారెక్టర్ చేస్తోంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలో ఖరారు చేస్తామని నిర్మాత తెలియజేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, ఫోటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఫైట్స్: సెల్వ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్కినేని వెంకటరత్నం, నిర్మాత: డి.శివప్రసాదరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: కిరణ్.
About Writer
SELVI.M