గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » ఐశ్వర్యారాయ్ బచ్చన్ : హ్యాపీ బర్త్ డే (World Beauty | Aishwarya Rai Bachan | Big B | Jaya Bachan | Abhishek Bachan)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FILE
1973 నవంబర్ 1న ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ జన్మించారు. ఇప్పుడు ఆమె 36వ సంవత్సరంలోకి అడుగిడుతున్నారు. తన అందచందాలతో ప్రపంచంలోని సౌందర్యారాధకులకు ఆమె ఆరాధ్య దేవత.

ఇప్పటికికూడా ఆమె అందం, నడకతీరు, అమాయకత్వం, కళ్ళల్లోనున్న చురుకైన చూపులకు కుర్రకారు ఠారెత్తిపోతుంటారు. ఆమె తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్దులను చేస్తుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ వయసు దాగదుకదా...!

వయసు పెరిగేకొద్దీ శారీరకంగా, మానసికంగా పరిపక్వ దశకు చేరుకుంటారు. ఇప్పుడు ఐష్ పరిస్థితి ఇలాగే ఉంది. వెండితెరపై అమ్మాయిలాగా, తన అందమైన మోముతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. అలాగే ఓ మహిళగాను నటించి పలువురి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓ గృహిణిగా రాణిస్తోంది.

ఇకపోతే బాలీవుడ్ బాద్‌షా, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్యకు వివాహమైంది. దీంతో అప్పుడప్పుడు మీడియాలో ఆమె తల్లి కావాలని కోరుకుంటున్నట్లు వార్తలు పుకార్లై షికార్లు చేస్తుంటాయి. దీనిని ఐష్ సవినయంగా స్వీకరించి ఆనందిస్తుంటారు. ఆమె అభిమానుల్లోను అదే ఉత్సాహం ఉంది. ఐష్ ఎప్పుడు తల్లి అవుతుందా అని ఆమె అభిమానుల్లో కలవరం ఏర్పడుతోంది. అలాగే ఆమె మామగారైన బిగ్‌బి కూడా చాలా సార్లు తనను తాతయ్య చేయమని ఆమెను వేడుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

అంతర్జాతీయ కుటుంబం :

ఐష్ కుటుంబానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపువుంది. ఆమె కుటుంబంలో నలుగురు సూపర్ స్టార్‌లున్నారు. గతంలోనే అమితాబ్ బచ్చన్ తన నటనా చాతుర్యంతో ప్రపంచంలోని సినిమా అభిమానులకు తానేంటో నిరూపించుకున్నారు. అలాగే ఆమె అత్తగారైన జయా బచ్చన్ వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార, అలాగే ఆమె రంగస్థల నటిగా కూడా బాగానే రాణించారనడంలో అతిశయోక్తి కాదు.

అలాగే ఆమె జీవిత భాగస్వామి అభిషేక్ బచ్చన్ సినిమా రంగంలో తొలుత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పలేదు. ఐష్‌ను వివాహమాడిన తర్వాత అతనికి మరింత గుర్తింపు లభించింది. ఇకపోతే ఐష్ స్వయంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటి. "కాన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్" "జ్యూరీ అవార్డు"కు ప్రత్యేక ఆహ్వానితురాలిగా భారతదేశం నుంచి హాజరైన తొలి హీరోయిన్.
FILE


ఐష్‌ సమకాలీకులు ఇప్పుడు బాలీవుడ్‌లో కనపడటం లేదు. ఉదాహరణకు ఆమె నటించే రోజుల్లో తెరపైకి వచ్చి ఆమెకు పోటీనిచ్చిన వారిలో రాణీ ముఖర్జీ, ప్రీతీ జింతా తదితరులు ఇప్పుడు వెండి తెరపై కనపడటమే గగనమైపోతోంది. అదే ఐష్ ఇప్పటికీ నటనాపరంగా చాలా బిజీగానే ఉంది. అదే ఆమె నటన, అందంలోని రహస్యం.

అలాగే ప్రముఖ హీరోయిన్‌గా వచ్చిన "మిస్ యూనివర్స్" సుస్మితా సేన్ ఐష్ కన్నా వయసులో చిన్నదైనా ఏ మాత్రం పోటీనివ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె అవుట్ ఆఫ్ ఫోకస్ అని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటుంటారు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్లుగా చలామణి అవుతున్న కత్రినా కైఫ్, దీపికా పదుకొనే తదితర నాయికలున్నారు. వీరందరికన్నా కూడా ప్రతినిత్యం మీడియాలో సెంటర్-పాయింట్‌గా వెలుగొందుతున్నారు. అప్పుడప్పుడు తన అందచందాలతో, కొన్ని సందర్భాలలో బచ్చన్ కుటుంబానికి చెందిన కోడలుగా వార్తలలోకి ఎక్కుతునే ఉంటారు. అలాంటి ఐష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదామా...! హ్యాపీ బర్త్‌ డే ఐష్...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ప్రపంచ సుందరి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్, మిస్ యూనివర్స్, సుస్మితా సేన్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే