1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Harish Shankar

Pavan Kalyan | Harish Shankar | Bade Ravi | Ganesh Babu | డిశెంబరులో "పవర్ స్టార్" సినిమా ప్రారంభం

పవన్ కల్యాణ్
WD
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువదర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో బడే రవి సమర్పణలో నటుడు గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.3 కి పక్కాగా స్క్రిప్ట్ రెడీ అయింది.

ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ, "పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో ఓ మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేశాం. పవన్ కల్యాణ్ సరసన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటిస్తారు.

గతంలో పవన్ కల్యాణ్ సూపర్ హిట్ చిత్రానికి మ్యూజిక్ చేసిన యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తారు. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో ఓ సెన్సేషనల్ హిట్ చిత్రానికి కెమేరామెన్‌గా వర్క్ చేసిన టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ నిర్వహిస్తారు. ఓ ప్రముఖ ఫైట్ మాస్టర్ పవన్ కల్యాణ్‍తో ఫస్ట్‌టైమ్ చేయబోతున్నారు." అని చెప్పారు.

కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ "పులి" ఫినిష్ అవగానే చేసే చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రానికి సమర్పణ: బడే రవి, నిర్మాత: గణేష్ బాబు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరీష్ శంకర్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT