1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Swetabasu Prasad

Kalavar King | Swetabasu Prasad | Playing cards | Tollywood | Cinema, | "కళావర్ కింగ్"లో శ్వేతాబసు ప్రసాద్

కళావర్ కింగ్
పేకాటలో కళావర్ కింగ్ కోసం ఎదురుచూస్తుంటారు. పేక ముక్కల్లో దానికే అగ్రస్థానం. నిజజీవితంలో ఓ వ్యక్తికూడా అలాంటివాడే. అతను తన చుట్టుప్రక్కల ఉన్నవారికోసం ఏం చేశాడు? తనకోసం ఏం చేసుకున్నాడు? అనే కథాంశంతో కళావర్ కింగ్ చిత్రం రూపొందుతోంది.

శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎల్ సురేష్ దర్శకుడు. సోమవారంనాడు ఈ చిత్ర టైటిల్‌ను ఖరారు చేశారు. నిఖిల్ మాట్లాడుతూ... రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. రాజమండ్రి, హైదరాబాదులలో వాటి చిత్రీకరణ జరుగుతుంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చెప్పారు.

శ్వేతాబసు ప్రసాద్ మాట్లాడుతూ... పిల్లి ఎలుక ఛేజింగ్‌లా మా పాత్రలుంటాయి. చక్కని ఎంటర్‌టైనర్ ఇది అని తెలిపారు. నిర్మాత డిఎస్ రావు మాట్లాడుతూ... ద్రోణ తర్వాత పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ చిత్రమిది. మంచి టెక్నీషియన్స్‌తో ఈ చిత్రం రూపొందింది అన్నారు. కాగా ఈ చిత్రానికి కెమేరా: బాలమురుగన్, సహ నిర్మాతలు: శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT