గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » నటుడు శివాజీ చిత్రం తాజ్‌మహల్ ఆడియో విడుదల (Shivaji | Taj Mahal | Audio | Bhumika Chawla | Dasari Narayana Rao)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
కన్నడ చిత్రమైన తాజ్‌మహల్‌ను తెలుగులో అదే పేరుతో నటుడు శివాజీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఆడియో విడుదల సోమవారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. ముఖ్య అతిథి దాసరి నారాయణరావు ఆడియో సీడీని విడుదల చేసి హీరో శ్రీకాంత్‌కు అందించారు.

నటి భూమిక క్యాసెట్‌ను విడుదల చేశారు. దాసరి మాట్లాడుతూ... "నటులకు స్వంత సంస్థ ఉండాలి. అప్పుడే తమకు నచ్చిన కథలను సినిమాగా రూపొందిస్తారు. శివాజీ తనకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకుని మళ్లీ రూటు మార్చాడు. మళ్లీ ఇప్పుడు తన రూటులోకి వచ్చాడు. నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ... "14 ఏళ్ల క్రితం తాజ్‌మహల్ పేరుతో సినిమా చేశాను. ఆ చిత్రం నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం శివాజీ నిర్మిస్తున్న చిత్రం కూడా అంతపేరు తెస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.

ఇక నటుడు శివాజీ తన కెరీర్ గురించి విశ్లేషించుకున్నాడు. హైదరాబాద్ వచ్చి డబ్బింగ్ ఆర్టిస్టుగా, టీవీ యాంకర్‌గా ఉన్ననాటి సంగతులను నెమరువేసుకున్నాడు. నటుడి నుంచి నిర్మాతగా ఎదిగగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శివాజీ, తాజ్ మహల్, ఆడియో, భూమికా చావ్లా, దాసరి నారాయణ రావు