1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sandhya

Hasini | Sandhya | Kamalakar | Ramyashree | Sudeepa | సంధ్య "హాసిని" 90 శాతం పూర్తి

హాసిని
WD
అభి ఫేమ్ కమలాకర్ హీరోగా సంధ్య హీరోయిన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం హాసిని 90 శాతం షూటింగ్ పూర్తయిందని చిత్ర దర్శకుడు బి.వి. రమణారెడ్డి తెలియజేశారు.

మంగళవారంనాడు చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, "చిన్నపెద్దా అందరినీ గిలిగింతలు పెట్టేట్లుగా పూర్తిస్థాయి హాస్యభరితంగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఇప్పటికి 90 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంకా మూడు పాటలను చిత్రీకరించాల్సి ఉంది. ఒక పాటను ఈ నెల 10 నుంచి ఊటీలో చిత్రీకరిస్తాం. మిగిలిన 2 పాటలను ఈ నెలాఖరులోగా విదేశాల్లో తీస్తాం. డిసెంబరులో సినిమాను విడుదల చేస్తామ"ని చెప్పారు.

కమలాకర్ మాట్లాడుతూ... "ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథతో తయారైంది. కథ చెప్పినప్పుడే ఈ చిత్రాన్ని దర్శకుడు రమణారెడ్డికోసం చేయాలనిపించింది. ఆయనకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

సంధ్య మాట్లాడుతూ... "మరో చక్కటి తెలుగు చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంద"న్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్, ధర్మవరపు, అలీ, వేణుమాధవ్, వాసు ఇంటూరి, రాగిణి, రమ్యశ్రీ, సుదీప తదితరులు నటిస్తున్నారు. మాటలు: మరుధూరి రాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. ప్రవీణ్ చంద్ర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమణారెడ్డి, నిర్మాత: కమలాకర్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT