Mahesh Babu | Varudu | Kiladi | Anushka | మహేష్ బాబు "వరుడు" కాదు "కిలాడి"
WD
ఇటీవలే తాజా షెడ్యూల్ హైదరాబాదులో జరిగింది. మహేష్ బాబు, అనుష్క పాల్గొనగా ఓ ప్రైవేటు భవంతిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ ఈ నెల 11 నుంచి రాజస్థాన్‌లో నెలరోజులపాటు జరుగుతుంది.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత బుల్లి సుబ్బారావు మాట్లాడుతూ... రాజస్థాన్ షెడ్యూల్ తర్వాత డిసెంబరులో వికారాబాద్‌లో వేస్తున్న భారీ సెట్‌లో నిర్మాణం చేస్తాం. ఈ చిత్రంలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు ముగించుకుని వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం అన్నారు.
ప్రకాష్‌రాజ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమేరా: సునీల్ పటేల్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్, ఆర్ట్: ఆనందశాయి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: త్రివిక్రమ్