Posani Krishna Murali | Jentilman | New picture | Porducer | Audio | ఆడవారిలో శీలం పోయే పార్ట్‌లు ఉన్నాయా?: పోసాని
WD
WDతాజాగా పోసాని కథానాయకుడిగా, స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "జెంటిల్‌మెన్" ఆడియో విడుదల కార్యక్రం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీకాంత్ ఆడియోను ఆవిష్కరించి తొలి క్యాసెట్‌ను పోసానికి అందజేశారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. సహజంగా నా చిత్రాల్లో పాటలు తక్కువ. ఈ సినిమాకు అలా ఉండకూడదని పాటలు పెట్టాను. నాకు సంగీతం గురించి తెలియదు. కానీ వినే జ్ఞానం ఉంది. సంగీత దర్శకుడు మల్లిక్ శర్మ మంచి బాణీలను సమకూర్చారు. అందులో వినసొంపైన సంగీతం ఉందన్నారు.
ఇక కథాపరంగా చెప్పాలంటే.. ఆడదాని శీలం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. కానీ శీలం పోయే పార్ట్‌లు ఆడదానిలో ఉండవు. అది ఏమిటనేది ఈ చిత్రం కథ అని చెప్పారు. అంతకుముందు హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. నేనెప్పుడూ గుండు కొట్టించుకోలేదు. అలాంటిది తొలిసారిగా "ఆపరేషన్ దుర్యోధన"తో గుండె కొట్టించి నా కెరీర్‌ను మలుపుతిప్పాడు.
అది ఎంతో పేరు తెచ్చింది. ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస్ ఎంతో ప్లానింగ్, నిబ్ధత కలిగిన వ్యక్తి అని చెప్పారు. మరో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. నల్లం శ్రీనివాస్ ఈ చిత్రం విజయంతో పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. "గజిబిజి" దర్శకుడు వాసు మాట్లాడుతూ.. పోసానితో "తింగరోడు" అనే చిత్రాన్ని నిర్మించాను. 'జెంటిల్‌మెన్' తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు.