1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Manchu Manoj

Bindaas| Manchu Manoj| Sheena| Varsham| Pournami| Vedam| Allu Arjun| Yeleti| Prayanam | శిల్పారామంలో "బిందాస్" ఆడియో వేడుక

బిందాస్
WD
ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు మనోజ్ హీరోగా, షీనా కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బిందాస్". "అజయ్‌గాడి విజయగాథ" అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక.

ఈ చిత్రం ద్వారా వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, పౌర్ణమి చిత్రాలకు రచయితగా పనిచేసిన వీరుపోట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోను ఈ నెల తొమ్మిదో తేదీన శిల్పారామంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నారు.

ఏలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "ప్రయాణం" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మంచు మనోజ్‌కు "బిందాస్" సినిమా రెండో సినిమా కావడం గమనార్హం.

ఇంకా క్రేజీ హీరో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మల్టిస్టారర్ చిత్రం 'వేదం'లోనూ మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
About Writer
SELVI.M