Balakrishna | Cinema | Nandi Award | CM | Chandrababu | NTR | ఎలా వచ్చిందని అడిగితే పళ్లు రాలిపోతాయ్: బాలయ్య
File
FILEతన తండ్రి హయాం నుంచి నంది అవార్డుల ప్రదానోత్సవం జరుగుతూ వస్తే ఆయనకు లెక్కలేని నంది అవార్డులు వచ్చేవన్నారు. అయితే, తన బావ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తనకు ఒక నంది అవార్డు వచ్చింది. అదే మా ఇంటికి వచ్చిన తొలి నంది అవార్డు అని అన్నారు.
ఈ నంది అవార్డు కూడా బావ వద్ద పైరవీ చేయించుకుని ఇప్పించుకున్నట్టు పలుచోట్ల గుసగుసలు వచ్చాయన్నారు. మరికొందరు తనను డైరక్టుగా అడిగేందుకు సాహసం చేశారు. అలా ఎవరైనా అడిగివుంటే పళ్లు రాలిపోయి ఉండేవని బాలకృష్ణ అన్నారు. దీంతో ఆ సభలో ఒక్కసారి గొల్లుమని నవ్వుల శబ్దం వినిపించింది.