1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Pavan Kalyan

Mahesh | Pavan Kalyan | MAA | Star Night | Rajasthan | Shooting | Dasari | పవన్-మహేష్‌లపై ఆరు నెలల నిషేధం సాధ్యమేనా!

మహేష్ బాబు
File
FILE
వరద బాధితుల సహాయార్థం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్వహించిన స్టార్‌నైట్‌కు హాజరుకాని నటీనటులపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు గంభీరంగా ప్రకటించారు. అయితే, ఈ స్టార్‌నైట్ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబుతో సహా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాలేదు. వ్యక్తిగతంగానే ఇలాంటి పబ్లిక్ కార్యక్రమాలకు వీరిద్దరూ కాస్త దూరంగానే ఉంటారు.

అయితే, జాతీయ విపత్తు నేపథ్యంలో నిధుల సమీకరణ కోసం చేపట్టిన స్టార్‌నైట్‌‌లో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని చిత్రపరిశ్రమ పిలుపునిచ్చింది. ఇందుకోసం ఏకంగా మూడు రోజుల పాటు సెలవుదినాలను కూడా ప్రకటించింది. అయినప్పటికీ కొంతమంది నటీనటులు డుమ్మా కొట్టారు. వీరిలో ఇద్దరు ప్రధాన హీరోలు ఉండటం దర్శకరత్నకు ఏమాత్రం రుచించడం లేదు.

"కిలాడి" షూటింగ్ నిమిత్తం మహేష్ బాబు రాజస్థాన్‌కు వెళ్లగా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల రీత్యా గైర్హాజయ్యారు. అయితే, ఆరోగ్య కారణాలను మినహాయింపు ఇస్తామని దాసరి ప్రకటించారు. కానీ మహేష్ బాబు షూటింగ్‌కు వెళ్ళగా, పవన్ కళ్యాణ్ హాజరుకాక పోవడం గమనార్హం. వీరిపై 'మా' లేదా దాసరి ఎలాంటి చర్య తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
About Writer
PNR