1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. celebrate

Magadheera | celebrate | 100-day fete | Ramcharan | Geeta Arts | Chiru | ఈనెల 15వ తేదీన "మగధీర" శతదినోత్స వేడుకలు!

మగధీర
File
FILE
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ "మగధీర" సినిమా శతదినోత్సవ వేడుకలు ఈనెల 15వ తేదీన జరుగనున్నాయి. జులై 31వ తేదీన 14 దేశాల్లో 1200 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. 223 థియేటర్లలో వంద రోజులను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో పెద్దఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రం విడుదలైన తొలివారంలో రూ.22 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు అంచనా.

అయితే, తాజా రిపోర్ట్ ప్రకారం ఆడియో విక్రయాలతో కలుపుకుని ఈ చిత్రం రూ.95 నుంచి రూ.100 కోట్ల వరకు వసూలు చేసినట్టు, ఇందులో ఆదాయం మాత్రమే 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల అంచనా. దీంతో చిత్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిలు శతదినోత్స వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
About Writer
PNR