India | Arts | Culture | November | India-America Kalaparishath Filmotsav | New York | న్యూయార్క్‌లో భారతీయ చలన చిత్రోత్సవం
భారతీయ కళలు, సంస్కృతిని పెంపొందించాలనే ఉద్దేశంతో నవంబర్ 11న మహీంద్రా భారత్-అమెరికా కళాపరిషత్ ఫిల్మోత్సవ్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా 47 లఘు, ఫీచర్, డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శించనున్నామని నిర్వాహకులు తెలిపారు. వీటిలో 44 చిత్రాలను ప్రీమియర్ షోలుగా ప్రదర్శించనున్నామని, ఇందులో భాగంగా తొలి చిత్రంగా నసీరుద్దీన్ షా నటించిన చిత్రం టుడేస్ స్పెషల్‌ను ప్రదర్శిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తాము నిర్వహించే కళాపరిషత్ ఫిల్మోత్సవ్ సంబరాలు తొమ్మిదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఇవి నవంబర్ 15వ తేదీ వరకు జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ నిర్మాత శ్యామ్ బెనగల్ నిర్మించిన "వెల్ డన్ అబ్బా", అనురాగ్ కశ్యప్ నిర్మించిన "గులాల్" చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు.