9th Class c/o Malleswaram| Pranay| Rakhi Sen| Students| Shooting| Schedule | విద్యార్థుల మనోభావాలకు అద్దంపట్టే "9th క్లాస్ c/o ఏలేశ్వరం"
డాక్టర్. ఎ. చంద్రశేఖర్ (మాజీ మంత్రి) సమర్పణలో ఎమ్. రాజ్‌కుమార్ నిర్మాతగా ప్రణయ్, రాఖీసేన్ హీరోహీరోయిన్లుగా పి. రామకృష్ణగౌడ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "9th క్లాస్ c/o ఏలేశ్వరం". మానస ఆర్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో 30 శాతం టాకీనీ పూర్తి చేసుకుంది.
ఈ నెల మూడో వారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై చిత్రీకరణ ఉంటుందని చిత్ర సమర్పకులు డా. ఎ. చంద్రశేఖర్ తెలియజేశారు.
ఇందులో ఆరు పాటలుంటాయని, ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చారు. త్వరలో రికార్డింగ్ పూర్తి చేసుకుని, మూడో షెడ్యూల్‌ను డిసెంబర్ చివరి వారం నుంచి ప్రారంభిస్తామని సమర్పకులు వెల్లడించారు.
సుమన్, నాజర్, షాయాజీషిండే, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, ఆహుతిప్రసాద్, వేణుమాధవ్, జీవా, మాస్టర్ భరత్, నరసింగ్ యాదవ్, ముమైత్ ఖాన్, సనా, హేమ, జయలలిత, గీతాసింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: మిడిదొడ్డి బ్రదర్స్, మాటలు: రవిప్రసాద్, పాటలు: సిరివెన్నెల చంద్రబోస్, కెమెరా: మోహన్, ఎడిటర్: గౌతంరాజు, నిర్వహణ: భూతం నాగేశ్వర్, సమర్పణ: డా.ఎ. చంద్రశేఖర్, నిర్మాత: ఎమ్. రాజ్‌కుమార్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ప్రతాని రామకృష్ణగౌడ్.
