1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Cinema

Gadde Sindhura| Cinema| Suspense Thriller| Schedule| Shooting | సస్పెన్స్ థ్రిల్లర్‌గా "గద్దె సింధూర" కొత్త చిత్రం

గద్దె సింధూర
యాదగిరిరాజు సమర్పణలో శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై 'గద్దె సింధూర' ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. నగేష్ దర్శకత్వంలో నూతన నిర్మాత కిరణ్ నిర్మిస్తోన్న ప్రొడక్షన్ Hనెం.1 చిత్రం.. ఇటీవలే తలకోనలో తొలిషెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నగేష్ మాట్లాడుతూ.. 30 సంవత్సరాల క్రితం జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామన్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పూర్తిస్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇదని, నవంబర్ నాలుగో తేదీతో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నామని నగేష్ తెలిపారు.

ఇందులో కొంత టాకీతో పాటు, కొరియోగ్రాఫర్ ప్రదీప్ ఆంటోని సారథ్యంలో గద్దె సింధూరపై ఓ పాటను చిత్రీకరించామని దర్శకుడు వెల్లడించారు. రెండో షెడ్యూల్ నవంబర్ 25 నుంచి ప్రారంభమై, మొత్తం టాకీపార్ట్‌ను పూర్తిచేయనున్నామని వివరాలందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

అనిల్, కిషోర్, విజయ్, రవిప్రకాష్, తనికెళ్ళభరణి, రామిరెడ్డి, పృథ్వి, సుమన్‌శెట్టి, నిళగళ్‌రవి, పొన్నాంబళం తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: మధు ఎ. నాయుడు, సంగీతం: సాయి కార్తీక్, కొరియోగ్రఫీ: ప్రదీప్ ఆంటోని, ఎడిటర్: నందమూరి హరి, ఫైట్స్: నందు, సహ నిర్మాతలు: ప్రసాద్ రాజు, విష్ణువర్ధన్ రాజు, నిర్మాత: కిరణ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్.
About Writer
PNR