1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Antihero

Tarakaratan | Antihero | Sneha | Bhumika chawla | నందమూరి తారకరత్న.. విలన్!!

తారకరత్న
WD
గతంలో శౌర్యం చిత్రాన్ని నిర్మించిన ఆనందప్రసాద్ తాజాగా ఓ హార్రర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, స్నేహ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమరావతి అనే పేరును నిర్ణయించారు.

హారర్, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవి తెలియదేశారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా చిత్రాలను తీసే రవిబాబు కథ చెప్పగానే ఆనంద్ ప్రసాద్ ముందుకు వచ్చారు. ప్రేమ, యాక్షన్ అంశాలున్నా అవి కథాగమనంలో ఆసక్తికరంగా సాగుతాయన్నారు.

మెడికో విద్యార్థులు ఓ పరిశోధన నిమిత్తం తలకోన అటవీ ప్రాంతాలలోకి వెళితే... అక్కడ జరిగే సంఘటలేమిటనేదే ఈ చిత్రమని సమాచారం. ఇందులో విశేషమేమిటంటే... హీరోగా 9 చిత్రాలను ఏక కాలంలో ప్రారంభించి సక్సెస్ కొట్టలేకపోయిన నందమూరి తారకరత్న విలన్‌గా నటించడం. ఇకపై తను విలనీ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమేనని ఈ చిత్రం ద్వారా చెపుతున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT