Om Shanti| Navdeep| Nikil| Kajal Agarwal| Bindu Madhavi| Aditi Sharma| Logo| Audio | 18న నవదీప్, కాజల్‌ల "ఓం శాంతి" లోగో ఆవిష్కరణ
WD
విభిన్న కథా చిత్రంగా తెరకెక్కనున్న "ఓం శాంతి" నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో ఆవిష్కరణ నవంబర్ 18న జరుగనుంది. అలాగే ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో నవంబర్ 27వ తేదీన విడుదల కానుంది.
నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, అదితిశర్మ, మురళీమోహన్, రవికాలే, రోహిత్ పాఠక్, రఘుబాబు, సునీల్, సుమన్ శెట్టి, ప్రగతి, రణధీర్, శివారెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: ఇళయరాజా, మాటలు: నాగరాజు గంధం, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, జాని సెబాస్టియన్, డాన్స్: కృష్ణారెడ్డి, నిక్సన్, సాగర్, ఆర్ట్: భూపేష్.