Saleem | Audio release | Vishnuvardhan | Ileana | Mohan Babu | Dasari | ఇలియానా కాలు విరిగింది
WD
సలీం షూటింగ్ రాజస్థాన్ ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు యాక్షన్ సన్నివేశాల్లో ఇలియానా పడిపోవడంతో ఆమె కాలు విరిగింది. దానివల్ల సినిమా ఆలస్యమయిందనీ, దానికితోడు తన పెండ్లి కూడా జరగడంతో మరింత ఆలస్యమయిందనీ సలీం చిత్రం ఆలస్యానికి కారణాన్ని హీరో విష్ణువర్థన్ తెలియజేశారు.
వైవిఎస్ చౌదరి చిత్రమంటేనే ఆలస్యమవుతుందనీ, ఆయనకు బడ్జెట్‌పై కంట్రోల్ ఉండదనే విమర్శలు ప్రతి చిత్రానికి వస్తూనే ఉంటాయి. దేవదాసులో కూడా తన స్వంత బ్యానర్ అయినా భారీగా ఖర్చు చేసి లక్కీలో సక్సెస్ అయి బయటపడ్డాడు.
ఈ నేపధ్యంలో సలీం చిత్రం కూడా ఆలస్యానికి కారణం దర్శకుడు అనే విమర్శలు వచ్చాయి. కానీ ఆయన మాత్రమే కారణం కాదనీ, పై రెండు కారణాలు కూడా ఉన్నాయని విష్ణు చెప్పాడు. ఇంతకీ విష్ణుపై 23 కోట్లు వెచ్చించాల్సిన కథ ఏమిటో... వేచి చూడాల్సిందే.