Joy film | Audio release | Avitej | Trinath | Parvati | జాయ్ పాటలు విడుదల
అవితేజ్, త్రినాథ్ హీరోలుగా వైనవి, పార్వతి హీరోయిన్లుగా నటిస్తోన్న "జాయ్" చిత్రం పాటలు విడుదలయ్యాయి. బి.రాజా దర్శకత్వంలో అరుణై పిక్చర్స్ పతాకంపై ఇ.వి.వి కంభన్ నిర్మిస్తున్నారు. గురువారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ ఆడియోను విడుదల చేసి పరుచూరి గోపాలకృష్ణకు అందించారు.
అనంతరం తమ్మారెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్ర దర్శకుడు నాకు మనవడులాంటివాడు. నా శిష్యురాలు బి జయ. ఆమె శిష్యుడు ఇతను. కనుక ఆ విధంగా మనవడు అవుతాడు. ఇక సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ను నేనే పరిచయం చేశాను. దాదాపు నేను తీసిన 17 చిత్రాలకు ఆయనే సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రానికి పాటలు రాసిన భువనచంద్ర నేను తీసిన "అలజడి"కి పాటలతోపాటు మాటలు కూడా రాశాడు. యువకులతో రూపొందించిన ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... పోస్టర్లు చూస్తుంటే కాలేజీ కుర్రాళ్లే నటించారనిపిస్తోంది. పాటలను జడ్జ్ చేసేది ప్రేక్షకులే కాబట్టి వారే తీర్పు చెబుతారని అన్నారు. దర్శకురాలు జయ మాట్లాడుతూ... రాజా తన వద్ద రెండు చిత్రాలకు పనిచేశాడనీ, సాంకేతిక పరిజ్ఞానం తెలిసినవాడని అన్నారు.
