1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. barebacked posters

Karan Johar film | barebacked posters | Kareena Kapoor | Kurbaan | Shiv Sena | కరీనా... చీర కట్టుకుంటావా..? లేదా..? :శివసేన

కరీనా కపూర్
IFM
"కుర్బాన్" చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సంచలనం సృష్టించింది. ఆ పోస్టర్‌లో కరీనా తన వీపును పూర్తి నగ్నంగా ప్రదర్శిస్తూ ప్రియుడు సైఫ్ ఎదుట నిలిచి ఉంటుంది. ఈ పోస్టర్ ముంబయి ప్రధాన కూడళ్లలో దర్శనమిస్తోంది. వీటిని చూసిన శివసేన శివాలెత్తిపోతోంది. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఒళ్లంతా చూపెట్టడమే కాక దానిని ఆయా కూడళ్లలో ప్రదర్శించడంపై మండి పడుతోంది.

ఈ పోస్టర్లు ఎక్కడ ఉన్నా తొలగించాల్సిందిగా సేన తన కార్యకర్తలకు సూచించింది. దీంతో ముంబయిలోని జుహు, అంధేరి, మరోల్ తదితర ప్రాంతాల్లో అంటించి ఉన్న పోస్టర్లను వెతికి మరీ చింపి పారేస్తున్నారు. సుమారు 100 మంది శివసేన కార్యకర్తలు కరీనా నగ్న వీపుతో కూడుకున్న పోస్టర్లు ఎక్కడ కనబడినా వాటిని తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

కరీనా నగ్న వీపు ప్రదర్శన గురించి శివసేనకు చెందిన యాక్టివిస్ట్ జితేంద్ర మాట్లాడుతూ..." పోస్టర్లలో అర్థనగ్న శరీరాలను ప్రదర్శించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు గొడ్డలిపెట్టు లాంటిది. ఈ సంస్కృతిని తక్షణమే విడనాడాలి" అని అన్నారు.

అంతేకాదు ఓ అడుగు ముందుకేసిన శివసేన కార్యకర్తలు, నేరుగా కరీనా కపూర్ ఇంటికెళ్లి కరీనాను చీర కట్టుకుని బయటకు రావాలని సూచించారు. అయితే కరీనాకపూర్ ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో వారంతా తిరిగి వెళ్లిపోయారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT