1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Shilpa Shetty

Bollywood actress | Shilpa Shetty | Hema Malini | Sridevi | Kareena Kapoor | Nayanatara | marriage | మాకు పెళ్లయిన మగాళ్లే కావాలి: క్యూట్ హీరోయిన్స్

బాలీవుడ్ నటీమణులు
IFM
బాలీవుడ్ సుందరాంగులు పెళ్లైన మగాళ్లంటే తెగ మోజు పడుతున్నారట. అంతేకాదు సదరు పెళ్లైన పురుషుడు అంగీకరిస్తే పెళ్లికి సై అంటున్నారు. ఉదాహరణకు తాజాగా పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి ఆల్రెడీ పెళ్లయిపోయిన లండన్ ఆధారిత వ్యాపారస్తుడు రాజ్ కుంద్రాను వివాహమాడబోతోంది. రాజ్ తనను అపూరూపంగా చూసుకుంటాడని కితాబిస్తోంది. అతనికి ముందే పెళ్లయిపోయిందిగా అనంటే... అయితేనేం అతనంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అసలు మగడుగా అతనిని తప్ప మరెవరినీ ఊహించుకోలేనని తెగేసి చెప్పింది.

శిల్ప సంగతి అలా ఉంచితే బాలీవుడ్ బాంబ్ షెల్ కరీనా కపూర్ సైతం పెళ్లయిపోయిన సైఫ్ అలీ ఖాన్ వెంట వెర్రిగా తిరుగుతోంది. అతను కూడా ఇంతకుముందే నటి అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ తను సైఫ్‌ను వదలి ఒక్క క్షణం కూడా ఉండలేనని కరీనా ఛాన్సు దొరికినపుడల్లా చెపుతుంటుంది.

కరీనా పరిస్థితి ఇలా ఉంటే, ఆమె అక్క కరిష్మా సైతం తొలుత అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుందామనుకుని ఆనక అది బెడిసి కొట్టడంతో వివాహమైన సంజయ్ కపూర్‌ను పెళ్లాడింది. అదేవిధంగా బాలీవుడ్ ప్రౌఢతార రవీనా టాండన్ సైతం పెళ్లయిన మగాడిని ఎంతో ఇష్టపడి వివాహమాడింది.
WD


ఇక మన దక్షిణాది విషయానికి వస్తే... ఈ మధ్య నయనతార పెళ్లయిన ప్రభుదేవాను తనవాడిని చేసుకోవాలని ఉవ్వీళ్లూరుతోందన్న వార్తలు గుప్పుమన్నాయి. ప్రభుదేవా సైతం నయనతారను విడిచి ఉండటం లేదని భోగట్టా. ఇది తెలిసిన ప్రభుదేవా భార్య తన భర్త వెంట నయన కనబడితే తన్నులు తప్పవని బెదిరించింది. అయినప్పటికీ వాళ్లిద్దరూ తమదైన లోకంలో విహరిస్తూనే ఉన్నారు.

ఇంకా ఇదే దారిలో మరికొంతమంది హీరోయిన్లు పయనిస్తున్నట్లు సమాచారం. పెళ్లయిన మగాళ్లయితే కేవలం తమ బాగోగులకోసమే తమను వివాహమాడతారనీ, పెళ్లికాని మగాళ్లు కేవలం తమ డబ్బును చూసి తమను వరిస్తారని ఈ భామలు చెపుతున్నారట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT