Kareena | Bare-back | Saif Ali Khan | saree | Kurbaan | Shiv Sena, | నా నగ్న వీపును కళాత్మక దృష్టితో చూడండి: సేనకు కరీనా సూచన
నవంబరు 20వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానున్న కరీనా చిత్రం "కుర్బాన్"కు సంబంధించిన కరీనా బేర్‌బ్యాక్ వాల్‌పోస్టర్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. కరీనాకపూర్ సిగ్గు లేకుండా వీపు మొత్తాన్ని నగ్నంగా చూపించిందని శివసేన విరుచుకుపడటమే కాక చీర కట్టుక తిరగాలని కరీనాకు సూచించింది.
శివసేన మాటలకు కరీనా కపూర్ స్పందించింది. శివసేన తనకు మంచి చీర పంపిస్తే ఆనందంగా స్వీకరిస్తాననీ, అయితే తనకు ఇప్పటివరకూ శివసేన నుంచి ఎటువంటి చీర అందలేదని తెలిపింది.
ఇదిలావుంటే శివసేన మహిళా కార్యకర్తలు కొందరు కరీనా నగ్నవీపుతో ముంబయి నగరంలో అతికించి ఉన్న పోస్టర్లన్నిటికీ చీరలను చుట్టి తమ నిరసనలను తెలిపారు. ఈ సందర్భంగా శివసేన కార్యకర్తలు కరీనాపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇటువంటి నగ్న వేషాలను ప్రదర్శించడం నీచమని ధ్వజమెత్తారు.
ఇదిలావుంటే కష్టపడకుండానే తన చిత్రానికి పబ్లిసిటీ వస్తున్నందుకు చిత్ర దర్శకనిర్మాతలు సంతోషంతో చిందులేస్తున్నట్లు భోగట్టా.
