గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » "అదుర్స్"గా వస్తోన్న ఎన్టీఆర్, నయనతారల చిత్రం (Adurs| NTR| Nayanatara| Sheela| Vinayak| Brahmanandam)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
NTR, Nayana
WD
ఎన్టీఆర్, నయనతార, షీల కాంబినేషన్‌లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి "అదుర్స్" అనే పేరును ఖరారు చేశారు. ఆదివారంనాడు అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర లోగోను ఎన్టీఆర్, వినాయక్‌లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "వినాయక్‌తో హ్యాట్రిక్ కొట్టాలని చాలా జాగ్రత్తగా ఆలోచించి కథను తయారుచేశాం. అదుర్స్ అనే టైటిల్ అందరికి నచ్చిన టైటిల్. ఈ రోజు చిత్రంలోని చివరిపాటను పూర్తిచేశాం. ఇంకా రెండు రోజుల ప్యాచ్‌వర్క్ మిగిలి ఉంది. డిసెంబరులో సినిమాలు విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని" చెప్పారు.

దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ.. క్యాజువల్‌గా ఈ చిత్రం "అదుర్స్" అని అన్నాను. ఇది అలా బయటికి పాకి పాపులర్ అయింది. ఇది ఎన్టీఆర్‌కు గొప్ప టైటిల్. ఇందులో 2.20 నిమిషాల్లో గంటన్నరపాటు నవ్వులు కురిపిస్తాడు. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబినేషన్‌ అదుర్స్‌గా ఉంటుంది. ఫోటో సెషన్ చూశాక ఎన్టీఆర్ చాలా అందంగా కన్పించాడు. యాక్సిడెంట్ తర్వాత డ్యాన్స్ ఎలా చేయగలడనే వారికి అదిరేట్లు నృత్యం చేసి చూపిస్తాడని పేర్కొన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో అన్ని అదుర్స్‌గా ఉంటాయి. రెట్టింపు ఉత్సాహంతో ఎన్టీఆర్ డ్యాన్స్ చేశాడు. కృష్ణలో నా పాత్రను ఎలా డీల్‌చేశాడో దర్శకుడు ఈ చిత్రంలో అంతకంటే ఎక్కువగా డీల్ చేశాడని" అన్నారు.

నిర్మాత వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం అన్నివిధాలా అందరి మెప్పు పొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమర్పకుడు కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిర్మాతలు మేమైనప్పటికీ వెనుకనుంచి మమ్మల్ని నల్లమలుపు బుజ్జి సరైన మార్గంలో నడిపించారని అన్నారు.

ఇంకా ఈ చిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, ఆర్ట్: ఆనంద్ సాయి, డైరక్టర్ ఆఫర్ ఫోటోగ్రఫీ: ఛోటాకెనాయుడు, సంగీతం: దేవీశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వినాయక్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: అదుర్స్, సినిమా, ఎన్టీఆర్, నయనతార, షీల, వినాయక్, బ్రహ్మానందం