Bumper offer| Platinum Disc| Puri Jagannath| Sairam Shankar| Bindu Madhavi | "బంపర్ ఆఫర్"ను హిట్‌చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్: పూరి
WD
ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెన్సింగ్ రావడంతో అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. "బంపర్ ఆఫర్"తో సంగీత దర్శకుడిగా పరిచయమైన రఘు కుంచే అద్భుతమైన సంగీతం అందించారు. పూరీ సంగీత్ ద్వారా విడుదలైన బంపర్ ఆఫర్ ఆడియో సినిమా విడుదలకు ముందే పెద్ద సక్సెస్ కావడం, సినిమా రిలీజ్ అయిన తర్వాత సేల్స్ మరింత పెరగడమే కాకుండా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలను వైభవంగా జరుపుకుంది.
ఆదివారం (నవంబర్ 15) హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్‌రోడ్‌లోని సుదర్శన్ 70 ఎంఎంలో బంపర్ ఆఫర్ ట్రిపుల్ డిస్క్ ఫంక్షన్ ప్రేక్షకుల హర్షధ్వనుల మధ్య ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో డాషింగ్ డైరక్టర్, చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్, హీరో సాయిరాం శంకర్, హీరోయిన్ బిందు మాధని, దర్శకుడు జయరవీంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శంకర్ గణేష్, సంగీత దర్శకుడు రఘు కుంచే తదితరులు పాల్గొన్నారు. థియేటర్లో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి ముందు జితేందర్ చేసిన మిమిక్రీ ప్రేక్షకులను అలరించింది.
సింగర్ సింహా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పూరీ సంగీత తరపున శంకర గణేష్ యూనిట్ సభ్యులకు "బంపర్ ఆఫర్" ప్లాటినం డిస్క్‌లను ప్రదానం చేశారు.
ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన నిర్మాత, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. మీ అందరి సమక్షంలో ఈ ఫంక్షన్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య హిట్ సినిమాలు తియ్యడం చాలా కష్టమైంది. వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఐదు మాత్రమే విజయానికి నోచుకుంటున్నాయి.
ఆ ఐదులో మా బంపర్ ఆఫర్ కూడా స్థానం సంపాదించడం సంతోషంగా ఉంది. బంపర్ ఆఫర్ హిట్ కావడంతో సాయిరాంశంకర్‌కు, బిందు మాధవికి మంచి గుర్తింపు లభించింది. ఇంత మంచి హిట్ చిత్రాన్ని అందించిన నా స్నేహితుడు, దర్శకుడు జయరవీంద్రకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పూరీ చెప్పారు.
హీరో సాయిరాంశంకర్ మాట్లాడుతూ.. మా బంపర్ ఆఫర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించిన రఘు కుంచేకి, లిరిక్ రైటర్ భాస్కర్ పట్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ.. బంపర్ ఆఫర్‌తో సంగీత దర్శకుడుగా పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన జగన్‌కు, ఆడియోతో పాటు సినిమాను ఘన విజయం చేసిన ప్రేక్షకులను కృతజ్ఞతలు చెప్పారు. రవణమ్మ పాట చిత్రానికి గ్రాండ్ ఓపెనింగ్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు జయరవీంద్ర, గేయ రచయిత భాస్కర పట్ల, హీరోయిన్ బిందు మాధవిలు మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, తమకు అవకాశం కల్పించిన పూరి జగన్నాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.