Cheta Venna Mudda, Shooting, Happy Days, Krithika Krishnan, Altaf, krishnudu | షూటింగ్‌ను పూర్తి చేసుకున్న "చేత వెన్నముద్ద"
WD
హ్యాపీడేస్ ఫేమ్ "కృష్ణుడు" నటిస్తోన్న ఈ చిత్రం గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్. భరత్ కుమార్ మాట్లాడుతూ.. హీరోహీరోయిన్లతో పాటు పలువురు విదేశీ అమ్మాయిలపై "అందాలపూదోట తోటలో ఒక మేడ.." అనే పాట చిత్రీకరణ జరుగుతోందన్నారు.
ఇదే షెడ్యూల్‌లో మరో పాటను కూడా చిత్రీకరించడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. సంగీత దర్శకుడు రవిస్వరూపన్, లావణ్య ద్వయం అందించిన బాణీలు అద్భుతంగా వచ్చాయని భరత్ కుమార్ అన్నారు.
దర్శకుడు రోహిత్ ఎస్. అభ్యుదయ్ మాట్లాడుతూ.. ఇద్దరు గాఢ ప్రేమికుల మధ్య ఏర్పడ్డ శూన్యతను కాలం ఎలా పరిష్కరించింది అనేది ఈ చిత్ర కథాంశమన్నారు.
సహ నిర్మాత పామరాజు జానకిరామ్ మాట్లాడుతూ.. తెలుగులో తొలిసారిగా మెర్సీకిల్లింగ్‌పై నిర్మిస్తున్న చిత్రమిది. హీరో ఆల్తాఫ్, హ్యాపీడేస్ ఫేమ్ క్రితిక క్రిష్ణన్‌లపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ప్రేమికుల్లో కొత్త అనుభూతిని కలిగిస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమా పాటలను ఈ నెలాఖరులో విడుదల చేసి, సినిమాను డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జానకిరామ్ అన్నారు.
సమర్పకుడు బెల్లంకొండ రఘు మాట్లాడుతూ.. మెర్సీకిల్లింగ్‌పై రూపొందుతోన్న కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు.
శిల్పా జాగృతి, కృష్ణుడు, అన్నాజెన్, మెటిల్డా, మైక్, శశి, హరికృష్ణ, నీరజపాండే, కృష్ణవేణి శతగోపన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రవిస్వరూపన్-లావణ్య, కెమెరా: రవి.కె. నీర్ల, పాటలు: రవిస్వరూపన్, ఇమంది రామారావు, కథ: వి.ఎన్. సతీష్, మాటలు: మోహన్ తుమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎమ్. భరత్‌కుమార్, సి.ఎస్. కుమార్, స్క్రీన్‌ప్లే, సహనిర్మాత: పామరాజు జానకిరామ్, నిర్మాణ నిర్వహణ: శ్రీకాంత్ వడ్ల, నిర్మాత: పి.ఆర్. కుమార్, దర్శకత్వం: రోహిత్. ఎస్. అభ్యుదయ్.