Tollywood | Tammareddy | Ameer Khan | Tare zameen par | Hero | టాలీవుడ్‌లో దమ్మున్న మగాడు లేడు: తమ్మారెడ్డి
File
FILEహైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
బాలీవుడ్‌లో బాలలను కేంద్రంగా చేసుకుని వచ్చిన 'తారే జమీన్ పర్' వంటి సందేశాత్మక చిత్రాల తరహాలో సినిమాలు చేసేందుకు మన హీరోలు ఎందుకు ముందుకు రావడంలేదని మీడియా అడిగిన ప్రశ్నకు తమ్మారెడ్డి ఘాటుగానే సమాధానం ఇచ్చారు.
టాలీవుడ్‌లో నిజమైన మగాళ్లు లేరు (హీరోల్లో రియల్ మెన్). ఎవరైనా ఉంటే చూపించండి అంటూ ప్రశ్నించారు. అమీర్ ఖాన్ వంటి గట్స్ కలిగిన హీరో టాలీవుడ్‌లో ఎవరున్నారని అడిగారు. తారే జమీన్ పర్ వంటి చిత్రాలు నిర్మించాలంటే.. కేవలం డబ్బు మాత్రమే సరిపోదని, ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధి ఎంతో అవసరమన్నారు.
అయితే, మన హీరోలు తమ స్టార్ డమ్‌కు కట్టుబడి పట్టుగూడుల్లోంచి బయటకు రావడానికి ఇష్టపడరని వ్యాఖ్యానించారు. టాలీవుడ్‌లో కీలక దర్శకనిర్మాతగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌ను ఏ మేరకు కుదుపుతాయే వేచి చూడాల్సిందే.