1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Om Shanti| Cinema| Logo Launch| Kajal Agarwal| Navadeep| Bindu madhavi| Nikhil| Aditi Sharma | వినూత్నంగా "ఓం శాంతి" లోగో ఆవిష్కరణ

ఓం శాంతి
WD
నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం "ఓం శాంతి". వైజయంతి హౌస్ నుంచి త్రీ ఏంజిల్స్ స్టూడియోస్ పతాకంపై ప్రకాష్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ, ప్రియాంక చలసాని నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

"ఓం శాంతి" లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సినీ చరిత్రలో ఎవరూ చేయని విధంగా త్రీ ఏంజెల్స్ స్టూడియోస్ చేసింది. స్టేజ్‌పై స్పాట్‌లైట్‌లు పడుతుండగా చిత్రంలో నటించిన నవదీప్, కాజల్ అగర్వాల్, నిఖిల్, బిందుమాధవి, అదితిశర్మ తమ పాత్రల పేరుతో పరిచయం చేసుకుని తమ కథ గురించి భిన్నంగా చెప్పడం జరిగింది.

ఇవి పాత్రల వివరాలు, వారు పరిచయం చేసుకున్న విధాన

నవదీప్: కాలేజ్ అయిన వెంటనే మంచి జాబ్. వీకెండ్ వచ్చేసరికి క్లబ్ అండ్ పబ్. నా లైఫ్ హ్యాపీ. నా పేరు ఆనంద్. కానీ జీవితంలో ఒక కష్టం వచ్చిన తర్వాతగానీ సుఖం విలువ తెలియలేదు. ఇది నా కథ.

అదితిశర్మ: నా పేరు అంజలి. లైఫ్‌లో ప్లానింగ్ చాలా ముఖ్యం. అందుకే ప్లాన్ చేసుకోకుండా నేను ఏ పని చేయను. ఇది నా కథ.

నవదీప్: నేను తనకు ఎగ్జాట్‌లీ ఆపోజిట్. అందుకే మేమొక జంట. ఇది మా కథ.

బిందుమాధవి: ఆదాబ్. మేరా నామ్ నూరిహై. మేరా షాదీ జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ బాద్‌షాఖాన్ సే హోనే వాలీ హై. యే మేరీ చోటీసీ కహానీ హై.

నిఖిల్: ఏంటి ఈ తెలుగు సినిమాలో హిందీ గోల? అసలు హీరోని ఇక్కడ పెట్టుకుని మీ అందరి గోల ఏంటి? నన్ను చూసి మీకు అర్థమయిపోయే ఉంటుంది. నా పేరు తేజ. నా టార్గెట్ రవితేజ.

కాజల్ అగర్వాల్: స్టేజీ మీదకి నడుచుకుంటూ రావడం రొటీన్. ఇలా గాల్లోంచి దిగితేనే థ్రిల్లింగ్. నా పేరు మేఘన. వావ్! ఇదేంటి ఈ సినిమాలో నేనే హీరోయిన్ అనుకుంటే ఇంకా ఇద్దరున్నారేంటి! దిస్ ఈజ్ సో ఎగ్జయింటింగ్.

అనగానే ఐదుగురు కలిసి ఐదు కథలు, ఐదు జీవితాలు, ఒక నిజం అదే "ఓం శాంతి" అని చెప్పి లోగోని ఆవిష్కరించారు.

మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో నవంబర్ 27న విడుదల కానుంది. నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, అదితిశర్మ, మురళీమోహన్, రవికాలే, రోహిత్ పాఠక్, రఘుబాబు, సునీల్, సుమన్ శెట్టి, ప్రగతి, రణధీర్, శివారెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: ఇళయరాజా, మాటలు: నాగరాజు గంధం, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, జాని సెబాస్టియన్, డాన్స్: కృష్ణారెడ్డి, నిక్సన్, సాగర్, ఆర్ట్: భూపేష్, నిర్మాత: శేషు ప్రియాంక చలసాని, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ప్రకాష్