Bollywood | Partially nude | Bare back | Bare chested | Actresses | నగ్నానికి కూతవేటు దూరంలో బాలీ భామలు
వెండితెరపై ముద్దులు హద్దులు మీరుతున్నాయి. చీకటి సన్నివేశపు ముద్దులు నేడు గాఢ చుంబనలుగా మారి నిర్భయంగా తెరకెక్కుతున్నాయి. ఒకప్పుడు ముద్దు సన్నివేశం వస్తుందనగానే దృశ్యం నలుపు రంగుకు మారి చీకటి కనబడేది. ఆ చీకట్లో సదరు జంట ముద్దు అనుభవాన్ని చవిచూస్తున్నట్లు సంభాషణ మాత్రం వినిపించి వదిలేసేవారు. క్రమంగా అటువంటి దృశ్యాలు కనుమరుగై గాఢ చుంబన దృశ్యాలు వెండితెరపై ప్రత్యక్షమవుతున్నాయి.
వేడి ముద్దులను ఇవ్వడంలో హాలీవుడ్ సినీ పరిశ్రమదే తొలి స్థానం. అయితే పాశ్చాత్య పోకడలను వ్యతిరేకించే భారత్‌లోనూ నేడు క్రమంగా హాలీవుడ్ స్థాయి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. గాఢ చుంబనలు నేడు సర్వసాధారణమైపోయాయి.
ఇక తాజాగా నడుము వరకూ అర్థ నగ్నంగా శరీరాన్ని చూపేంచేందుకు కొందరు బాలీవుడ్ తారలు ఉబలాటపడుతున్నారు. అదేమంటే అటువంటి సన్నివేశాలను సృజనాత్మక దృష్టితో చూడాలని హితబోధలు చేస్తున్నారు.
ఈ వినోద వ్యాపారంలో నేడు వేడి ముద్దులు.. నగ్నానికి కూత వేటు దూరంలో అర్థనగ్న దృశ్యాలూ కలిసి తమ రేటును పెంచేస్తున్నాయి. ఏ నగ్నానికైనా రె"ఢీ" అనేందుకు తలుపులు బార్లా తీసుకుని ఎదురు చూస్తున్నట్లున్నాయి. బాలీవుడ్ అంతే.. మరి టాలీవుడ్ ఎంతో!!
