1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. డిసెంబరు 25న మా నాన్న చిరంజీవి

Maa Naanna Chiranjeevi, Jagapati Babu, Neelima, Atulit | డిసెంబరు 25న మా నాన్న చిరంజీవి

జగపతిబాబు
జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం మా నాన్న చిరంజీవి చిత్రాన్ని లాఫింగ్ లార్డ్స్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై వి.టి. గిరిధరరావు, మురళీ సంయుక్తంగా నిర్మించారు. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన గిరిధరరావు మాట్లాడుతూ... 35 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. సినిమా చేయడం తెలుసు కానీ డిస్ట్రిబ్యూషన్ తెలియదు. నట్టికుమార్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.

నట్టికుమార్ మాట్లాడుతూ... మొత్తంగా ఈ చిత్రాన్ని వాశాఖ టాకీస్‌పై విడుదల చేస్తాం. జగపతిబాబు చిత్రాలంటే మావిచిగురు వంటి వినోదాత్మక చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇందులో కూడా ఆ సినిమాలో ఉన్నట్లు సెంటిమెంట్ సన్నివేశాలు ఉంటాయి. డిసెంబరు 25న 90 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT