Actress Shilpa Shetty | Raj Kundra | Marriage | Sunday evening | Maharashtra hill station | శిల్పాశెట్టి- రాజ్ కుంద్రాల వివాహ మహోత్సవం
IFM
ఈ ఊరేగింపులో పెళ్లికుమారుడైన రాజ్ ఒక చేత కత్తిపట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని ప్రదర్శించాడు. బాలీవుడ్ నటులు భరత్ రాయ్, జాకీలిద్దరూ ఊరేగింపులో నాట్యం చేసి సందడి చేశారు. రాజరిక పద్ధతిలో శిల్పా-రాజ్‌ల వివాహం జరుగనుంది.
మరోవైపు శిల్పాశెట్టి ధరించిన ఖరీదైన వస్త్రాలను పాపులర్ డిజైనర్ తరుణ్ తహిలియాని రూపొందించారు. ఆమెకోసమే తరుణ్ ప్రత్యేకంగా వెడ్డింగ్ గౌన్‌ను తయారు చేశాడు. ఇక శిల్పకు కాబోయే భర్త రాజ్ మాత్రం శంతాను మరియు నిఖిల్ క్రియేషన్స్ ధరించాడు.
శిల్పాశెట్టి తన వివాహం సందర్భంగా తన బ్లాగులో అభిమానులను పలుకరించింది. తన అభిప్రాయాలను పంచుకుంది. ఒక సామాన్యమైన పెళ్లికూతురులాగే తనకు కూడా ఈ సమయంలో భిన్నమైన ఆలోచనలు, సంతోషం, ఆశ్చర్యం, ఒక రకమైన బిడియం, అదేవిధంగా పెద్దలను విడిచి వెళ్లాలన్న బెంగ అన్నిటినీ తను చవిచూస్తున్నానని పేర్కొంది. నిశ్చితార్థం జరిగింది మొదలు ఎంతోమంది అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారని.. వారందరికీ ధన్యవాదలు తెలియజేసింది.
మరి మనం కూడా శిల్పశెట్టికి శుభాకాంక్షలు చెపుదామా...!