గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » పాటల రికార్డింగ్‌లో "శ్రీ తులసీదేవి మహత్యమ్" (Nagarjuna| Ramya Krishna| Sankeerthana| Sri tulasi mahatyam| Cinema|| Songs| Recording)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
గతంలో నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో "సంకీర్తన" చిత్రాన్ని నిర్మించిన డా. ఎం. గంగయ్య మళ్లీ 25 ఏళ్ళకు "శ్రీ తులసీదేవి మహత్యమ్" చిత్రానికి శ్రీకారం చుట్టారు.

కోణాక్క్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి గణేశసాయి దర్శకత్వం వహించగా, గురురాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ ప్రసాద్‌ల్యాబ్స్ స్టూడియోలో జరిగింది.

ఈ సందర్భంగా చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ.. ఇది మహిళా చిత్రం. అగ్గిపెట్టెలాంటి ఇంటిలో కూడా తులసీ మొక్కకు ప్రాధాన్యత ఇస్తారు. తులసీ మొక్క ఎలా పుట్టింది. వాటి పూర్వపరాలేమిటి? అనే నేపథ్యంలో కథ తయారుచేసుకున్నాను. మొదటిభాగం ఆధ్యాత్మికంగానూ, రెండోభాగం సోషియో ఫాంటసీగానూ కథ సాగుతుంది.

భారతీయ సంప్రదాయంలో తులసీ ప్రాధాన్యతను తెలియజేస్తూ.. తులసీలో 22 రకాలున్నాయి. కానీ ఇందులో ఐదింటిని మాత్రమే పూజిస్తాం. ఇందుకోసం ప్రముఖ మాతాజీ నుంచి వివరాలు కూడా సేకరించి సినిమాగా మలుస్తున్నామని తెలిపారు.

ఆధ్యాత్మిక సంస్థ "భారతీయం" కన్వీనర్ జి. సత్యవాణి తులసీ ప్రాముఖ్యతను వివరిస్తూ... యుద్ధాలు, పుట్టుక, చావుల్లో తులసీ వినియోగాన్ని వెల్లడించారు.

నిర్మాత గంగయ్య మాట్లాడుతూ.. ఇళయరాజా బీట్‌కు ప్రాధాన్యతనిస్తారు. అందుకే ఆయనతో ఆనాడు "సంకీర్తన" చేశాను. ఆ తర్వాత సరైన కథలు రాకపోవడంతో దూరంగా ఉన్నాను. కానీ తులసీపై రాసిన కథ నచ్చి నిర్మాతగా ముందుకువచ్చాను. ఎటువంటివారికైనా మనశ్శాంతినిచ్చే కథాంశమిదని చెప్పారు. త్వరలో షూటింగ్ వివరాలను తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ సినిమాలో ఐదు పాటలున్నాయని, ప్రస్తుతం ప్రీమిక్సింగ్ దశలో ఉన్నాయని, కథరీత్యా గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉందని సంగీతదర్శకుడు గురురాజ్ తెలిపారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా: ఎం. నరసింగరావు, ఆర్ట్: విజయ్ కృష్ణ.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: నాగార్జున, రమ్యకృష్ణ, సంకీర్తన, శ్రీ తులసీదేవి మహత్యమ్, సినిమా, పాటలు, రికార్డింగ్