1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Raviteja

Sambho Siva Sambho| Raviteja| Allari Naresh| Siva Balaji| Priyamani| Songs| Shooting | అరకులో "శంభో శివ శంభో" పాటల చిత్రీకరణ

శంభో శివ శంభో
WD
"కిక్" హీరో రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "శంభో శివ శంభో". తమిళం "నాడోడిగళ్" సినిమాకు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పాటలను అరకులో చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.

సముద్రకని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను సాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. అరకులో అల్లరి నరేష్, ప్రియమణి, రవితేజ, శివ బాలాజీలపై రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు.

ఈ పాటల చిత్రీకరణ ఈ నెల 28తో పూర్తి కానుంది. రవితేజ, ప్రియమణిలపై షూటింగ్ జరుపుకుంటున్న పాట ప్రముఖ సినిమాలోని ఓ హిట్ సాంగ్‌ రీమేక్‌ అని తెలిసింది. నృత్య దర్శకుడు దినేష్ మాస్టర్ నేతృత్వంలో ఈ పాటల షూటింగ్ జరుగుతోంది.

ప్రేమ, స్నేహం నేపథ్యంలో సాగే ఈ సినిమా, తెలుగులో వచ్చిన గత చిత్రాలకంటే భిన్నంగా ఉంటుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి తమిళం "నాడోడిగళ్" చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్ర కనికే తెలుగు చిత్ర దర్శకత్వ పగ్గాలు అప్పగించినట్లు బెల్లంకొండ సురేష్ చెప్పారు. ఇదేవిధంగా.. తమిళ చిత్రానికి సంగీతం సమకూర్చిన సుందర్. సి తెలుగు చిత్రానికి కూడా సంగీతం అందిస్తారని నిర్మాత వివరాలందించారు.

ఇందులో ముగ్గురు స్నేహితులుగా రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీలు నటిస్తుండగా, మిగిలిన పాత్రలను సునీల్, ప్రియమణి, రోజా, కృష్ణభగవాన్ తదితరులు పోషిస్తున్నారు.