Darling| Prabhas| Kajal Agarwal| Prabhu| Araku| Magadheera | అరకు సమీపంలో "డార్లింగ్" కోసం భారీసెట్!
WD
"మగధీర' ఫేమ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్ తొలిప్రేమ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణాకరన్ అద్భుతంగా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వి.వి.ఎన్.ఎస్. ప్రసాద్ "డార్లింగ్"ను నిర్మిస్తున్నారు.
మాస్‌ను ఆకట్టుకునే దిశగా జతకట్టిన ప్రభాస్, కాజల్ అగర్వాల్ డార్లింగ్ సినిమా కోసం అరకు సమీపంలో రెండో కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్‌ను నిర్మించారు.
WD
ఈ సెట్‌లో ప్రభాస్, కాజల్, ఆహుతి ప్రసాద్, తమిళ నటుడు ప్రభులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ డిసెంబర్ 15వ తేదీతో పూర్తి కానుందని సినీ యూనిట్ వర్గాలు తెలిపాయి.
బిల్లాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రేజీ హీరో ప్రభాస్ డార్లింగ్ చిత్రంలో ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాడని సినీ జనం అంటున్నారు.