Adurs| NTR| Nayantara| Shreya| V.V. Vinayak| Adi| Samba| Sayaji Shinde | డిసెంబర్ 3న ఎన్టీఆర్, నయనల "అదుర్స్" ఆడియో
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమర్పణలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం "అదుర్స్". వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం అదుర్స్ చిత్రం షూటింగ్ పూర్తయింది.
డిసెంబర్ మూడో తేదీన "అదుర్స్" ఆడియోను విడుదల చేసి, డిసెంబర్ మూడోవారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమర్పకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు చెప్పారు.
దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో ఆది, సాంబ చిత్రాల తర్వాత "అదుర్స్" హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని కొడాలి వెల్లడించారు. 'అదుర్స్'లోని రెండు పాత్రల్ని ఎన్టీఆర్ తప్ప ఎవరూ చెయ్యలేరని, ఎన్టీఆర్‌కు మాత్రమే సూట్ అయ్యే విధంగా ఆ పాత్రలుంటాయని వినాయక్ తెలిపారు.
ఈ చిత్రానికి కథ మాటలు: కోన వెంకట్, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఛోటా కె నాయుడు, ఆర్ట్ డైరక్టర్: ఆనందసాయి, ఫైట్స్: స్టన్ శివ, రామ్-లక్ష్మణ్, పాటలు: చంద్రబోస్, నృత్యం: రాజుసుందరం, ప్రేమ్‌రక్షిత్, కళ్యాణ్, నోబుల్, ఎడిటింగ్: గౌతంరాజు, కో-డైరక్టర్: పుల్లారావు కొప్పినీడి, చీఫ్ కో-డైరక్టర్: తోట రామకృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: జి.జి. కె. రాజు, ప్రొడక్షన్ మేనేజర్: చింతా రామకృష్ణ.
