1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rs 38 crores

Kurbaan | Rs 38 crores | Karan Johar | Kareena bare back | Saif Ali | కరీనా.. నీ నగ్న వీపు ఊపులకు... కాసులు రాలవ్!!

కుర్బాన్
బాలీవుడ్ సెక్సీతార కరీనా కపూర్ నటించిన కుర్బాన్ చిత్రం బాక్సాఫీసు వద్ద మోకాళ్లు చీరుకుపోతూ బొక్కబోర్లా పడింది. కరీనా తన నగ్న వీపును ప్రదర్శించడంతో ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు పెగ్గీలు కొట్టారు. చివరికి కలెక్షన్లు వారు ఆశించనంత స్థాయిలో లేకపోవడంతో నీరసించిపోయారు.

ఆ సంగతి అలా ఉంటే... కరీనా వ్యతిరేక వర్గం మాత్రం కరీనా, నీ నగ్న వీపు రేంజ్ ఏమిటో తేలిపోయిందిగా... అని పగలబడి నవ్వుతున్నారట. వీపును నగ్నంగా చూపించినంత మాత్రానికే కాసులు రాలతాయని అనుకుంటే... హాలీవుడ్ చిత్రాలు అంతకంటే మించిన వసూళ్లే రాబట్టగలవని ఎగతాళి చేస్తున్నారట.

భారీ అంచనాలతో కుర్బాన్ చిత్రాన్ని 38 కోట్ల రూపాయలతో నిర్మించారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్ యూటీవీకి కరీనా నగ్న వీపును చూపించి ఎకాఎకిన 50 కోట్ల రూపాయలకు ఆ చిత్రాన్ని అమ్ముకున్నాడు. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంతో ఆ చిత్రాన్ని యూటీవి ప్రపంచవ్యాప్తంగా 17 వేల తెరలపై విడుదల చేసింది. ఆ పిదప ప్రేక్షకులు రద్దీని చూసి గుడ్లు తేలేసింది.

మొదటి రోజున ఉన్న జనాలు రెండో రోజుకీ, రెండో రోజున ఉన్న జనాలు మూడో రోజుకీ లేకుండా క్రమంగా సినిమా హాళ్లు జనాలే లేక పీక్కుపోయాయి. కరీనా నగ్నవీపుపై నమ్మకంతో కొనుగోలు చేసిన కుర్బాన్ ఇలా కుదేలు చేస్తుందని ఊహించలేదని కొనుగోలుదారులు తలలు పట్టుకుంటున్నారట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT