1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. International Film Festival of India

Reliance Big Pictures| International Film Festival of India| Goa| Ijjodu| Janala| Kutty Shrank| Shob Charitro Kalponik | గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నాలుగు బిగ్ పిక్చర్స్!

గోవా
WD
అంతర్జాతీయ చిత్రోత్సవాలలో రిలయన్స్ బిగ్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన నాలుగు చిత్రాలు ఎంపికయ్యాయి. ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో జనాలా, కుట్టి ష్రాంక్, ఇజోడు, షోబ్ చరిత్రో కాల్పొనిక్ అనే నాలుగు చిత్రాలు ప్రదర్శంచబడనున్నాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పై నాలుగు చిత్రాలకు నిర్మాణ సారథ్యం వహించిన ఎం.ఎస్. సత్యు మాట్లాడుతూ.. కన్నడ సినిమా ఇజోడు, షాజీ కరుణ్.. మలయాళ చిత్రం కుట్టి ష్రాంక్, బెంగాలీ సినిమా షోబ్ చరిత్రో కాల్పొనిక్ అనే సినిమాలను ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఇందులో "ఇజోడు" సినిమా రాజకీయ, సామాజిక నేపథ్యంలో రూపొందిందని సత్యు అన్నారు. కళాత్మక, ఆధ్యాత్మిక, సాంప్రదాయాలకు అద్దం పట్టే ఈ చిత్రం టొరాంటొ ఫిలిమ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించబడిందని సత్యు తెలియజేశారు. అలాగే దుబాయ్‌లో డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభం కానున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు సత్యు అన్నారు.

అలాగే అద్భుతమైన కథాంశంతో, మమ్ముట్టి, కమలిని ముఖర్జీ నటించిన కుట్టి ష్రాంక్ సినిమా కూడా ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడుతోంది. ఇలా విభిన్న కథాంశంతో తెరకెక్కిన మిగిలిన చిత్రాలు కూడా వివిధ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడ్డాయని అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో బిగ్ పిక్చర్స్ సీఈవో సంజీవ్ మాట్లాడుతూ.. ప్రాంతీయ సినిమాలకు నిర్మాణ సారథ్యం వహించడంలో బిగ్ పిక్చర్స్ ముందంజలో ఉంటుందని చెప్పారు. అద్భుతమైన కథాంశాన్ని తెరకెక్కించే సత్తా గల దర్శకులను ప్రోత్సహించే దిశగా వారి సినిమాలను నిర్మించేందుకు బిగ్ పిక్చర్స్ అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు.
About Writer
SELVI.M