1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ప్రేమికుల రోజున స్టార్ ట్వంటీ-20 మ్యాచ్!

Twenty20I Lovers DayI Star CricketI BalakrishnaIJayasudhaI Murali MohanI Ali | ప్రేమికుల రోజున స్టార్ ట్వంటీ-20 మ్యాచ్!

ట్వంటీ20
WD
మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధ కళాకారుల కోసం ఓ నిధి ఏర్పాటు చేయడం కోసం క్రికెట్ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని సినీ నటుడు బాలకృష్ణ శనివారంనాడు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నవంబర్‌లోనే ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నామని, స్టార్‌నైట్ కార్యక్రమం వల్ల దీన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

ఫిబ్రవరి 14న ఈ మ్యాచ్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అదేవిధంగా 'మా' కార్యాలయానికి సంబంధించిన భవనాన్ని ప్రభుత్వం సహకరిస్తే ఏర్పాటు చేస్తాం. ఆ భవనంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని బాలయ్య వివరించారు.

'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ నిర్వహించడం ద్వారా వచ్చిన ధనంతో ఓ నిధిని ఏర్పాటు చేస్తాం. ఆ ధనాన్ని వృద్ధ కళాకారుల కోసం వినియోగిస్తాం. క్రికెట్‌తోపాటు సాంగ్స్, హాస్య కార్యక్రమాలకు సంబంధించిన కిట్స్ నిర్వహిస్తాం.

ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి నాగార్జున, చిరంజీవితో పాటు అందరూ పలురకాలుగా సహకరిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి వి.ఆర్.కె సంస్థకు చెందిన రవికుమార్ కో-ఆర్టినేటర్‌గా వ్యవహరిస్తున్నారని మురళీ మోహన్ వివరాలందించారు.

హాస్యనటుడు అలీ మాట్లాడుతూ.. పేద వృద్ధ కళాకారుల సహాయార్థం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయానికి తగిన భవనం లేదని, అటువంటి భవనం ఉంటే పలు కార్యక్రమాలకు ఆర్టిస్టులంతా రిహార్సల్ చేసుకోవడానికి వీలుంటుందని, ఆ దిశగా జయసుధ వంటి ప్రముఖులు ప్రభుత్వ సహకారంతో సాధించాలని పేర్కొన్నారు.

ప్రముఖ నటి జయసుధ.. 'మా' అసోసియేషన్ భవనం గురించి ఇంతకు ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాం. మళ్లీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తగిన విధంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇంకా ఈ కార్యక్రమంలో విష్ణు, రాజీవ్ కనకాల, ఒ. కళ్యాణ్, శివకృష్ణ, శ్రీకాంత్, శివబాలాజీ, హేమ, బెంగళూరు పద్మ తదితరులు పాల్గొన్నారు.
About Writer
SELVI.M