Mahesh BabuI Sreenu VytlaI Namo VenkatesaI EntertainmentI RomanceI Action | ఫిబ్రవరిలో ''మహేష్‌బాబు-శ్రీనువైట్ల కొత్త చిత్రం!
WD
ఈ చిత్రం గురించి హీరో మహేష్ మాట్లాడుతూ.. శ్రీనువైట్ల చెప్పిన స్టోరీ చాలా బాగుంది. ఓ డిఫరెంట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా అలరించే చిత్రం ఇదని ఆయన చెప్పారు.
దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. "మహేష్‌బాబుతో తొలి సినిమా చేస్తున్నాను. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ఇది. తొలి అర్థభాగం మేజర్‌గా నార్త్ ఇండియాలో జరుగుతుంది. ఎంటర్‌టైనన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్ అన్నీ మిక్స్ అయి ఉండే ఈ చిత్రంలో ఎక్స్‌లెంట్ విజువల్స్ ఉంటాయి. కథాపరంగా, టెక్నికల్ వాల్యూస్ పరంగా చాలా ఉన్నతస్థాయిలో ఉండే ఈ చిత్రం మహేష్‌బాబు పొటెన్షియాలిటీకి తగినట్లు చాలా గ్రాండ్‌గా ఉంటుంది. తొలిసారి సూపర్ 35 ఎంఎంలో షూట్ చేస్తున్న సినిమా ఇది" అని శ్రీనువైట్ల అన్నారు.
మహేష్‌బాబు అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రముంటుందని శ్రీనువైట్ల చెప్పారు. ముఖ్యంగా నిర్మాతలు రామ్, గోపి, అనిల్‌లను ప్రోత్సహించి వారికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన మహేష్‌బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.
తొలిసారిగా మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను సెన్సేషనల్ హిట్ అయ్యేలా రూపొందించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తామని శ్రీనువైట్ల అన్నారు. జనవరిలో "నమో వెంకటేశా" రిలీజ్ అవగానే ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని శ్రీనువైట్ల అన్నారు.