1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Cyber Crime

U&I Cinema| Cyber Crime| Rohan| Aditi| Shooting | సైబర్‌క్రైమ్ నేపథ్యంలో సాగే "యు అండ్ ఐ"

యు అండ్ ఐ
సైబర్‌క్రైమ్ అంశాన్ని టచ్‌చేస్తూ "యు అండ్ ఐ" చిత్రం రూపొందింది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఆదివారం నాడు చిత్ర దర్శకుడు రంజిత్ బెల్లూరి పలు విషయాలు తెలియజేశారు. 

ఈ కథలో ప్రధానంగా హీరో రోహన్ పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు అందుకు అనుగుణంగా తాము చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కాలేజీల్లోనూ పెద్ద పెద్ద మాల్స్‌లోనూ బాక్స్ పెట్టి పుస్తకాలను అందులో వేస్తే వాటిని పేదవారికి అందించే ఏర్పాటు చేస్తామన్నారు.

చిత్రం ప్రోగ్రెస్ గురించి చెబుతూ.. తొలికాపీ కూడా సిద్ధమైందని, డిసెంబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. రోహన్, అదితి, అలిషావైద్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని జెఎస్ఎం.ఎన్ సినిమా పతాకంపై రవీంద్రకుమార్ తోట నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా: శంకర్ కంతేటి, సంగీతం: కార్తీక్ ఎం, పాటలు: అనంతశ్రీరామ్, రంజిత్, సహనిర్మాత: కె. సత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రంజిత్ బెల్లూరి.