1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Jayahe| Cinema| Thriller Manju| Akash| Gowri Pandit| Telugu| Kannada | థ్రిల్లర్‌మంజు దర్శకత్వంలో ఆకాష్ హీరోగా "జయహే"

జయహే
WD
తెలుగు, కన్నడ భాషల్లో "జయహే" అనే చిత్రాన్ని థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే బెంగళూరులో ఈ చిత్ర టైటిల్‌ను రిజిష్టర్ చేశారు. తెలుగులో ఇదే టైటిల్‌ను రిజిష్టర్ చేస్తామని, ఒక వేళ ఇదే టైటిల్ వేరే సినిమాకు ఉంటే మారుస్తామని ఆదివారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంజు అన్నారు.

ఇందులో ఆకాష్ హీరోగా నటిస్తున్నాడని మంజు చెప్పారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఆకాష్, థ్రిల్లర్‌మంజులతో పాటు హీరోయిన్లుగా నటిస్తున్న గౌరిపండిట్, అయేషాపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. దీనికి దర్శకుడు శ్రీనువైట్ల క్లాప్‌కొట్టగా, ఛాంబర్ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ కెమేరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ చిత్రాన్ని హైదరాబాద్, బెంగళూరు, హాంకాంగ్‌లలో చిత్రీకరిస్తామని థ్రిల్లర్ మంజు అన్నారు. ఇందులో హీరోయిన్లు సైతం ఫైట్స్ చేస్తారని మంజు చెప్పారు. ఐదుపాటలున్న ఈ సినిమాలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నామని తెలిపారు.

హీరో ఆకాష్ మాట్లాడుతూ.. ఇందులో తాను పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నానని చెప్పాడు. "ఆంధ్రుడు" ఫేమ్ గౌరీపండిట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎక్కువభాగం షూటింగ్ పారిస్‌లో ఉంటుంది.

తమిళంలో యాక్షన్ చిత్రాలు ఎక్కువ చేశాను. అవే తెలుగులో తక్కువ. ఈ సినిమా ద్వారా తెలుగులోనూ పూర్తి యాక్షన్ సినిమా చేస్తున్నానని ఆకాష్ అన్నారు. ఇంకా ఈ చిత్రం ద్వారా తనకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకముందని ఆకాష్ వెల్లడించారు.