Badmash| Vandemataram Srinivas| G. Nagaiah| Naga Siddharth| Ektha | వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వంలో "బద్మాష్"
WD
ఇందులో నాగ సిద్ధార్థ్ హీరోగా, ఏక్తా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. తొలిషాట్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు క్లాప్ కొట్టగా, హీరో గోపిచంద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత నాగయ్య మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న తాను సినిమా రంగంలో ప్రవేశించాను. కథ కూడా ఎడ్యుకేషన్‌కు సంబంధించిందేనని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలా ఉండాలి? అనే విషయాలను చర్చించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నాగయ్య అన్నారు. డిసెంబర్ ఏడో తేదీ నుంచి షూటింగ్‌ను ప్రారంభించి జనవరికి పూర్తిచేస్తాం. అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఉన్న తనను నాగయ్య దర్శకుడిగా అవకాశమిచ్చి ప్రోత్సహించిన ఆయనకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. మంచి కథావస్తువుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకముందని శ్రీనివాస్ తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో ధర్మవరపు, సుమన్, చంద్రమోహన్, బాబూ మోహన్, వేణుమాధవ్, సత్యానంద్ తదితరులు నటించనున్నారు. కెమెరా: ఎన్. సుధాకర్‌రెడ్డి, ఆర్ట్: రమణ, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వందేమాతరం శ్రీనివాస్.